శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ఆమదాలవలసకు చెందిన బొడ్డేపల్లి నారాయణరావు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ చల్లా జగదీష్‌ను ఎన్నుకున్నారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్‌లోని ఆదివారం అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశంతోపాటు నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. కార్యాచరణ అధ్యక్షులుగా ఎం.భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఎ.ఈశ్వరరావు, కె.పద్మజ, కె.రాజారావు, బి.నిర్మల్‌కృష్ణ, కోశాధికారిగా ఒ.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా టి.ఆనందరావు(పురుషుల విభాగం), డి.యశోద (మహిళా విభాగం), సంయుక్త కార్యదర్శులగా కె.చిన్నమ్మడు, జె.రవికుమార్, సాంకేతిక సలహాదారుగా కేవీఎస్ మూర్తి, కార్యవర్గ సభ్యులగా మురళి, కుమారస్వామి, దాలయ్య, వసంతరావు, రామారావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ శ్రీకాకుళంలో జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించడమే లక్ష్యమన్నారు. కోడిరామ్మూర్తి స్టేడయం పనులు పూర్తయి, సరైన వసతులు సిద్ధం చేసుకుని అన్నీ అనుకూలిస్తే 2028లో నేషనల్ మీట్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘ ప్రతినిధులు, వివిద శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.


