● పోలీసులు పల్లెనిద్ర చేయాల్సిందే ● ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైమ్: దర్యాప్తులో పెండింగ్ ఉన్న ప్రాపర్టీ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని, నేరస్థలి లో లభించే భౌతిక, సాంకేతిక ఆధారాలను శాసీ్త్రయంగా విశ్లేషించి వాటి ఆధారంగా కేసులను త్వరగా ఛేదించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది ప్రతీ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమవ్వాలన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు ప్రజల సమస్యలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు.
నీట్ పీజీ పరీక్షలకు భద్రత
ఆదివారం జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్న నీట్ పీజీ –2026 పరీక్షలకు పటిష్ట పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం కూడలిలోని శ్రీశివానీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీవేంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నరసన్నపేట మారుతీనగర్–2లోని కోర్ టెక్నాలజీస్‌తో పాటు టెక్కలి ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల లోపలికి అనుమతించాలని, పరిసరాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేసేలా చూడాలన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు పరిశీలించి అవసరమైన చోట డ్రోన్ సర్వైలైన్సు ద్వారా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు.


