మెళియాపుట్టి: సత్యనారాయణ వ్రతానికి వెళ్తూ ప్రమాదానికి గురై మహిళ ప్రాణాలు విడిచిన ఘటన శనివారం మెళియాపుట్టి మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పాతపట్నం మండలం బడ్డుమర్రి గ్రామానికి చెందిన కోన ద్రాక్షవేణి(42) శనివారం ఉదయం మెళియాపుట్టి మండలం గుమ్మడ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి సత్యనారాయణ వ్రతంలో పాల్గొనడానికి తన తండ్రి కొల్లి రాములుతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో బురదరామచంద్రాపురం వద్ద కళ్లు తిరిగి బైక్‌మీద నుంచి కింద పడిపోయింది. వెంటనే అపస్మారక స్థితికి చేరుకోవడంతో చాపర పీహెచ్‌సీకి తరలించారు. ఆమె కోమాలో ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించి టెక్కలి రిఫర్ చేశారు. అక్కడ వైద్యం తీసుకోకుండా కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్‌లో పాతపట్నం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి భర్త హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.


