కంచిలి: మండలంలోని బూరగాం గ్రామానికి చెందిన దూపాన మాధవరావు గత కొన్ని నెలలుగా బోన్‌మ్యారో కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆరోగ్యం బాగా క్షీణించడంతో విశాఖపట్నంలో అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందారు. చికిత్స కోసం దాతలు సహకరించినా వ్యాధి నుంచి బయట పడలేకపోయాడు. మృతునికి భార్య విజయ, మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారు. మాధవరావు మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
మృతుడు
దూపాన మాధవరావు(ఫైల్)


