తంపర, రెండు హృదయాలు పుస్తకాల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

తంపర, రెండు హృదయాలు పుస్తకాల ఆవిష్కరణ

Aug 24 2026 1:19 AM | Updated on Aug 24 2026 1:19 AM

శ్రీకాకుళం కల్చరల్‌: శ్రీకాకుళ సాహితి, సాహితీ స్రవంతి సంస్థలు సంయుక్తంగా ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు వ్యాస సంపుటి ‘తంపర’ను సాహితీ స్రవంతి శ్రీకాకుళం జిల్లా శాఖ కన్వీనర్‌ కేతవరపు శ్రీనివాసు ఆవిష్కరించగా, తెలంగాణ రాష్ట్రం పాల్వంచకు చెందిన ప్రముఖ రచయిత శిరంశెట్టి కాంతారావు, ప్రసిద్ధ రచయిత గంటేడ గౌరునాయుడులు సంయుక్తంగా రచించిన ‘ఎన్నో ఉదయాలు.. రెండు హృదయాలు’ ప్రయోగశీల కావ్యాన్ని పట్టణానికి చెందిన వైద్యులు డాక్టర్‌ కణుగుల సుధీర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖులు చీకటి దివాకర్‌, చిగురుపల్లి ప్రభాకరరావు,, లండ సాంబమూర్తి, కల్లేపల్లి ఉదయ్‌కిరణ్‌, బాడాన శ్యామలరావు, దాసరి రామచంద్రరావు, పందిరి గోవిందరాజులు, పూజారి దివాకర్‌, నల్లి ధర్మారావు, బాల సుధాకర మౌళి, పీవీ నరసింహులు, చింతా అప్పలనాయుడు, సిరికి స్వామి నాయుడు, మల్లిపురం జగదీష్‌, పక్కి రవీంద్ర, కంచరాన భుజంగారావు, చీకటి చంద్రికరాణి, డప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement