అత్యంత వెనుకబడిన గిరిజన తెగల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా వసతిగృహాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి హిరమండలం మండలానికి ఒక వసతిగృహాన్ని ఎంపిక చేసింది. రూ.2.75 కోట్లు మంజూరు చేసింది. వసతిగృహ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా జరిగింది. కానీ ఇంతవరకూ అందులో విద్యార్థులకు విద్యాబోధన లేదు, వసతి లేదు. దీంతో ఈ భవనం నిరుపయోగంగా వెక్కిరిస్తోంది. వెనుకబడిన ప్రాంతాల్లో డ్రాపౌట్స్‌ను తగ్గించడం, నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో జన్‌మన్ వసతి గృహాలను ఏర్పాటుచేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గిరిజన సంక్షేమ శాఖ వెనుకబడి ఉంది. బాలబాలికలకు వేర్వేరుగా ఉండే ఈ వసతిగృహాల్లో ఈ లెర్నింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఈ వసతి గృహంలో విద్యాబోధన లేదు. నిర్వహణ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
– హిరమండలం


