పేదోడి ఇంట.. ధరల మంటనిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగు తున్నాయి. సర్కారు మౌనం వహిస్తోంది. –8లో
న్యూస్‌రీల్
● విద్యార్థుల విన్యాసం
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026
పర్యావరణ పరిరక్షణకు ప్రతి వ్యక్తి కృషి చేయాలని పర్యావరణ సంఘ నాయకులు పేర్కొన్నారు. పల్లిగొల్లగండి గ్రామంలో పర్యావరణ ప్రేమికులు రాఖీపౌర్ణమి విశిష్టత తెలియజేస్తూ, మహిళలకు చెట్లపై అవగాహన కల్పించి, పెద్ద వృక్షాలకు రాఖీలు కట్టించారు. చెట్ల మనుగడతోనే మానవజాతికి మేలు జరుగుతుందని తెలిపారు. – సోంపేట
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలో గురువారం ముందస్తుగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఖీ ఆకృతిలో ఏర్పడి విద్యార్థులు విన్యాసం చేశారు.
– వజ్రపుకొత్తూరు రూరల్
రాఖీ పండగ సందర్భంగా మార్కెట్లలో రాఖీలకు గిరాకీ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో ప్రత్యేక స్టాళ్లు వెలిశాయి. వినూత్నమైన రాఖీలను అందుబాటులో ఉంచాయి. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం మార్కెట్‌లో రాఖీ కొనుగోలు చేశారు. –పాతపట్నం


