యంత్రం.. కుతంత్రం | - | Sakshi
Sakshi News home page

యంత్రం.. కుతంత్రం

Aug 28 2026 2:33 AM | Updated on Aug 28 2026 2:33 AM

నరసన్నపేట:

రువు కావాలంటే లైనులో నిలబడమంటున్నారు. విత్తనం ఆశిస్తే నిరీక్షించాలని ఆదేశిస్తున్నా రు. సాగునీరు రాలేదంటే.. ఎల్‌నినో పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఆఖరకు యంత్రాలకు దరఖాస్తు చేసినా ఇవ్వలేకపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. రైతులను ఏ కోశానా ఆదుకోని చంద్రబాబు సర్కారు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టపరిహారం, ఎరువులు, విత్తనాలు పంపిణీ, పంటలకు మద్దతు ధర వంటి అన్ని అంశాల్లోనూ తీవ్ర అన్యాయం చేసింది. తాజాగా సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌ కింద సబ్సిడీతో కూడిన వ్యవసాయ యంత్రీకరణ పథకానికి అనుగుణంగా పరికరాలు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించి ఇప్పటికీ పరికరాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 7200 దరఖాస్తులు..

జిల్లాలో రూ.4.84 కోట్ల రాయితీతో 1376 యూని ట్లు మంజూరు చేశారు. మే నెల 5 నుంచి 29 వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల రైతుల నుంచి 7200 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో లాటరీ పద్ధతిపై లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, జూన్‌ నెలాఖరుకల్లా పరికరాలు రైతులకు ఖరీఫ్‌ పనులుకు వీలుగా అందిస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. అలాగే రాయితీపై స్ప్రేయర్లు, నూ ర్పిడి, పంటకోత యంత్రాలు, పవర్‌ టిల్లర్‌, రోటావేటర్లు, 40 హెచ్‌పీ లోపు ఉండే ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ఇస్తామని ప్రకటించారు. రైతులు ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ పరికరాలు మంజూరు చేయకపోవడంపై రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

ఇస్తారా.. ఎగ్గొడతారా..?

కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత బీసీ, ఎస్టీ, ఎస్సీలకు సబ్సిడీ పై రుణాలు ఇస్తామని పెద్ద ఎత్తున నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నారు. వందల మంది ఆశగా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకూ రుణాలు ఊసేలేదు. ఈ పద్ధతిలోనే వ్యవసాయ పరికరాల పంపిణీకి కూడా ఎగ్గొడతారా అనే అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతోంది. దరఖాస్తులు స్వీకరించి మూడు నెలలు అవుతోంది. ఖరీఫ్‌లో ఉబాలు, కలుపు నియంత్రణ, ఎరువుల యాజమాన్యం వంటి పనులు దాదాపుగా అయిపోయే కాలం వస్తోంది. కనీసం కోతల సమయానికైనా పరికరాలు అందిస్తారా.. లేదా రబీ వరకూ వేచి ఉండమంటారా అంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అసలు పరికరాల మంజూరుకు ఇంత జాప్యం ఎందుకు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు కాకుండా తమకు నచ్చిన వారికి ఇచ్చేందుకు కాలయాపన చేస్తున్నారా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తామన్నా.. లోపల ఏదో జరుగుతోందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే వ్యవసాయ పరికరాలు పంపిణీ ఇంత జాప్యమా రైతులు ప్రశ్నిస్తున్నారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి లాగిన్‌లో..

జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలన పూర్తి చేసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి లాగిన్‌లో వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు ఉంచారు. ఆయన అనుమ తి ఇచ్చిన తర్వాత జేసీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వీలున్నంత తొందరగా పరికరాలు అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. అయితే కాలయాపన జరుగుతుండటంతో రైతుల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాయితీ యంత్రాల కోసం

దరఖాస్తుదారుల నిరీక్షణ

ఖరీఫ్‌ ప్రారంభానికే ఇస్తామన్నా ఇవ్వని వైనం

జిల్లాలో 1328 యూనిట్లకు 7200 దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement