హత్య కేసు నిందితులకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసు నిందితులకు రిమాండ్‌

Aug 28 2026 2:33 AM | Updated on Aug 28 2026 2:33 AM

నరసన్నపేట: జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు హత్య కేసు నిందితులను జిల్లా జైలుకు తరలించారు. వృద్ధురాలి హత్య కేసులో కింతలి ధనలక్ష్మితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి న విషయం విదితమే. గురువారం ఉదయం నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నరసన్నపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. సివిల్‌ జడ్జి ఎస్‌.వాణి వీరికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు జిల్లా జైలుకు తరలించినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

‘మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి’

శ్రీకాకుళం: వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం జిల్లా పరిధిలోని సముద్రతీర మత్స్యకారులు తీవ్ర అప్రమత్తతతో ఉండాలని మత్స్యశాఖ ఉప సంచాలకు లు టి.సుమలత తెలిపారు. సముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందు న వేటకు వెళ్లే ప్రతి ఒక్కరూ ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ మత్స్యకారుల రక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన సూచనలు చేశారు. జిల్లా పరిధిలో ట్రాన్స్‌పండర్లు అమర్చిన అన్ని మోటరైజ్డ్‌ బోట్ల యజమానులు వేటకు వెళ్లే సమయంలో ట్రాన్స్‌పండర్‌ను తప్పనిసరిగా ఆన్‌లోనే ఉంచాలని తెలిపారు. లైఫ్‌ జాకెట్లు విధిగా తీసుకెళ్లాలని సూచించారు.

మేళ తాళాల మధ్య గ్రామదేవత తరలింపు

సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన మూలపేట గ్రామస్తులు సంప్రదాయాల ప్రకారం డప్పులు, వాయిద్వాలు, నృత్యాలు, మేళతాళాల నడుమ గ్రామ దేవత పెద్దమ్మ తల్లితో పాటు పలు దేవతామూర్తులను, రథాన్ని కొత్తగా నిర్మాణం అవుతున్న నౌపడ పునరావాస కాలనీకి ఊరేగింపుగా గు రువారం తరలించారు. గ్రామంలో ఉన్న మహిళలు ముర్రాటలతో పాటు పెద్దలు, యువకులు, చిన్నారులు అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి సుమారు ఐదు కిలోమీటర్లు వరకు నడిచి విగ్రహాలను పునరావాస కాలనీలో కేటాయించిన స్థలంలో ప్రతిష్టించారు. కొత్త ఆలయాలు నిర్మాణం అయ్యేంతవరకు పూజలు నిర్వహిస్తామని తెలిపారు.

‘నల్సా శిక్ష–2026’తో పేద పిల్లలకు సమగ్ర విద్య

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సమాజంలోని నిరుపే ద, బలహీన వర్గాల చిన్నారులు ఆర్థిక, సామాజిక కారణాలతో విద్యకు దూరం కాకుండా చూడటమే ‘నల్సా శిక్ష–2026’ పథకం ప్రధాన ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో గురువారం ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నల్సా రూపొందించిన ‘స్కీమ్‌ ఫర్‌ హోలిస్టిక్‌ ఇంక్లూషన్‌, నాలెడ్జ్‌ అండ్‌ స్కూలింగ్‌ త్రూ హెల్ప్‌ అండ్‌ యాక్సెస్‌’ (శిక్ష) ద్వారా విద్యార్థులకు సమగ్ర విద్యా సహకారాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు.

‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చంద్రబాబు డ్రామా’

నరసన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీఓ నంబర్‌ 176 ను వ్యతిరేకించి కో ర్టుల ద్వారా వెన్నుపోటు పార్టీ అధినేత చంద్రబాబు అప్పట్లో అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో బీసీలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని నమ్మబలుకుతూ జీఓ ఎంఎస్‌ నంబర్‌ 105 జారీ చేసి పాలాభిషేకం చేయించుకోవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బీసీల ఆత్మ గౌరవం గురించి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారానికి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో బీసీ వర్గాలకు రాజ్యాధికారం వచ్చిందని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement