న్యాయవాదుల విధుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల విధుల బహిష్కరణ

Aug 28 2026 2:33 AM | Updated on Aug 28 2026 2:33 AM

న్యాయవాదుల విధుల బహిష్కరణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ‘న్యాయవాద రక్షణ చట్టం’ తీసుకురావాలని శ్రీకాకుళం జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూన రాజారా వు డిమాండ్‌ చేశారు. గురువారం శ్రీకాకుళం నగరంలో జిల్లా బార్‌ అసోసియేషన్‌ నుంచి అంబేడ్కర్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. రెండు రోజులు విధుల బహిష్కరణలో భాగంగా గురువారం విధు లు బహిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణకు చట్టబద్ధమైన భద్రత కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణకు సంబంధించి ప్రత్యేక చట్టాలు అమలులోకి తీసుకువ చ్చారని తెలిపారు. ఇక్కడ కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement