● గిట్టుబాటు ధర కల్పించక పంట వేయని రైతులు
● ప్రభుత్వ సహకారం లేక మూతపడుతున్న షుగర్ ఫ్యాక్టరీలు
● ఏటా తగ్గుతోన్న సాగు విస్తీర్ణం
● పాత శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సంకిలి సుగర్ ఫ్యాక్టరీ మూతపడనున్న వైనం
2023
● క్రషింగ్ నిలిపివేత
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గత కొన్ని సంవత్సరాలుగా చెరుకు సాగు తగినంతంగా లేకపోవడం వల్ల డిసెంబర్ 2027 నుంచి మార్చి 2028 వరకు ప్రతిపాదించిన చెరకు క్రషింగ్ నిలిపివేయనున్నట్లు ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్ సంకిలి మేనేజ్‌మెంట్ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నెలకొన్న సూపర్ ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఈ సీజన్‌లో చెరుకు క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రైతులు గమనించి చెరుకు సాగు చేపట్టకుండా ఉండాలని కోరారు.
1575 హెక్టార్లు
2024
1102 హెక్టార్లు
2025
895 హెక్టార్లు
2026
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పంచదార చేదెక్కింది. వారం రోజుల వ్యవధిలోనే రూ.25 వరకు ధర పెరగడంతో కిలో పంచదార ఏకంగా రూ.75కు చేరుకుంది. దీనికి తోడు చెరుకు రైతులకు ప్రభుత్వ సాయం లేకపో
వడంతో పంట వేయడం లేదు. ప్రభుత్వం కూడా వ్యవసాయాధారిత ఫ్యాక్టరీలు షుగర్, జ్యూట్, రైస్ మిల్లర్లకు రుణాలు, సబ్సిడీలు తగ్గించేసి పొమ్మనలేక పొగపెడుతోంది.
సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం మొండిచేయి
గత 40 ఏళ్లుగా పాలకొండ మండలం సంకిలి సుగర్ ఫ్యాక్టరీ నుంచి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, రవాణా చార్జీలు ఇచ్చేవారు. దీంతో రైతులు చెరుకు పండించేందుకు ముందుకు వచ్చేవారు. సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం రాయితీలిచ్చి సహకరించేది. కానీ చంద్రబాబు హయాంలో ఫ్యాక్టరీని కాపాడే పనులు చేయ డం లేదు. దీంతో సంకిలి సుగర్ ఫ్యాక్టరీలో సుగర్‌కి సంబంధించి అన్ని ఉత్పత్తులు ఆపేసి కేవలం ఇథనాల్ మాత్రమే తయారు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం సహకారం అందించకపోవడమే సుగ ర్ ఫ్యాక్టరీల మూతకు కారణమని తేటతెల్లమైంది.
తగ్గిన చెరుకు సాగు విస్తీర్ణం
చెరుకు పండించే రైతుకు ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం మానేసింది. రాయితీలు ఇచ్చే కంపెనీలను సైతం ప్రోత్సహించడం లేదు. దీంతో కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి సుగర్ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఇటు రైతులు సైతం చెరుకు వేయడానికి ఇష్ట పడడం లేదు.
దీని ప్రభావం ధరలపై పడింది. గత వారం రోజుల్లోనే పంచదార ధర రూ.50 నుంచి రూ.75కు చేరుకుంది. నిత్యావసరా ల సరుకుల ధరలు పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమని జనం మండిపడుతున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలు మరిచిపోయి జనంలో కూటమి సర్కారు అప్రతిష్ట మూటగట్టుకుంది. ఇప్పుడు ధరల నియంత్రణ కూడా చేయకపోవడం సామాన్యులకు శరాఘాతమవుతోంది.
560
హెక్టార్లు


