● సినీహీరో సుమంత్
శ్రీకాకుళం అర్బన్: సెప్టెంబరు 11న విడుదల కానున్న మహేంద్రగిరి వారాహి చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆ చిత్ర హీరో సుమంత్ కోరారు. ‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళంలోని ఎస్‌వీసీ థియేటర్‌లో ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ చిత్ర యూనిట్‌కు ఎస్‌వీసీ థియేటర్ మేనేజర్ రవి ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఎస్‌వీసీ థియేటర్‌లో ఏర్పాటు చేసిన వారాహి అమ్మవారికి హీరో సుమంత్ పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుమంత్ మాట్లాడారు. గతంలో తాను శ్రీకాకుళం వచ్చానని, ఇక్కడి ఆదరణ మరువలేనని అన్నారు. మహేంద్రగిరి వారాహి సిని మా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందన్నారు. చిత్ర హీరోయిన్ మల్లికా గోస్వామి మాట్లాడుతూ తాను శ్రీకాకుళం రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రే క్షకులు చిత్ర ప్రేమికులని, మంచి చిత్రం అయి తే ఎంతో ఆదరిస్తారని తెలిసిందని, ఈ చిత్రం కూడా ఎంతో బాగా వచ్చిందని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలన్నారు.
నాలుగో రోజుకు చేరిన జూడాల నిరసన దీక్షలు
శ్రీకాకుళం: రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు చెవిలో పూలు పెట్టుకొని వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. శుక్రవారం నాటి నిరసన శిబిరంలో డాక్టర్ మోహిత్, డాక్టర్ మణికుమార్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ రమ్య, డాక్టర్ రిజ్వియా, డాక్టర్ ఆర్సియా, డాక్టర్ హయేషా, డాక్టర్ సంపద తదితరులు పాల్గొన్నారు


