సచివాలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

సచివాలయంలో చోరీ

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

రణస్థలం: జె.ఆర్‌.పురం–2 గ్రామ సచివాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగినట్లు పంచాయతీ కార్యదర్శి వి.చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామ రెవెన్యూ కార్యదర్శి బలివాడ శంకర్‌ సచివాలయం వద్దకు వెళ్లేటప్పుడు తాళం పగుల కొట్టి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రెండు టీవీలు, ప్రింటర్‌, రెండు మానిటర్లు, కొత్త కంప్యూటర్‌ వంటి వస్తువులు కనిపించలేదు. ఇటీవల పాతర్లపల్లి, పిసిని సచివాలయాల్లో ఇలానే చోరీలు జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. జె.ఆర్‌.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement