అదనపు బాధ్యతల ఒత్తిడితోనే.. | - | Sakshi
Sakshi News home page

అదనపు బాధ్యతల ఒత్తిడితోనే..

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

ఇచ్ఛాపురం రూరల్‌: మండపల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, సెన్సెస్‌ మండల సమన్వయకర్తగా, బీఎల్‌ఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రౌతు మెహర్‌ శుక్రవారం మృతి చెందాడు. విధుల ఒత్తిడి కారణంగానే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తోటి సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గార మండలం ఆరంగిపేటకు చెందిన మెహర్‌ రెండేళ్ల క్రితం బదిలీపై మండపల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. శుక్రవారం ఎం.తోటూరు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఆధార్‌ క్యాంపు నిర్వహిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సహోద్యోగులు తెలిపారు. అనంతరం ఆయన్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌గా పరిగణించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బరంపురం తరలిస్తుండ గా మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా ఉన్న ఉద్యోగులపైనే అదనపు విధులు మోపుతున్నారని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement