హిరమండలం: శ్రీకృష్ణాష్టమి వేడుకలకు కూర్మ గ్రామం ముస్తాబవుతోంది. సెప్టెంబరు 4 నుంచి రెండు రోజుల పాటు ఘనంగా వేడుకలు జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 4.30 గంటలకు హారతితో వేడుకలు ప్రారంభమై అర్ధరాత్రి 12.30 గంటల వరకూ కొనసాగుతాయి. మరుసటి రోజు ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకూ నగర సంకీర్తనలు, ప్రవచనాలు, పాదుకాభిషేకం, మంగళహారతి ఉంటాయి. వేడుకలతో పాటు రెండు రోజులు జరిగే అన్నదాన కార్యక్రమాలకు దాతలు, భక్తులు సహకారం అందించవచ్చని శ్రీకూర్మ వైదిక గ్రామ నిర్వాహకులు కోరారు.
‘ఆదిత్య’లో ప్రత్యేక కార్యక్రమాలు
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ నెల 22, 26, 29 తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుత మంగళవారం జరిగే అలుమ్నీ డే కార్యక్రమానికి సినీ నటుడు ప్రదీప్ కొండపర్తి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. 26న సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కె.హరిబాబు, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె.మధుమూర్తి అతిథులుగా హాజరవుతారని తెలిపారు. 29న సీఐఐ–ఐతం ఇండస్ట్రీ సమావేశానికి సీఐఐ వైస్ చైర్మన్ జి.సాంబశివరావు, శ్రవణ్ షిప్పింగ్ ఎండీ డి.రామకృష్ణ, ఎల్‌అండ్‌టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సి.జయకుమార్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. ఐఓటీ, ఏఐ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
విద్యా ప్రమాణాలు పెరగాలి
శ్రీకాకుళం రూరల్ : విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ అన్నారు. గురువారం పెదపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వసతులు, విద్యాభ్యాసం, ఇతరత్రా కార్యకలాపాలపై ఆరా తీశారు. ఏటీఎల్ ల్యాబ్‌ను సందర్శించి విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచనా విధానం, నూతన ఆవిష్కరణలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, శ్రీకాకుళం ఆర్డీవో ప్రత్యూష, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, డిప్యూటీ డైరెక్టర్ కె.వినాయకం తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఉపాధి శిక్షణ
ఎచ్చెర్ల : మండలం కేంద్రం ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా యువతకు సెల్‌ఫోన్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని సంస్థ డైరెక్టర్ రామ్‌జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9553410809, 7993340407 నంబర్లను సంప్రదించాలని కోరారు.
బెల్లం ఊట, సారా నిల్వలు ధ్వంసం
కంచిలి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో రెండు రాష్ట్రాల ఎకై ్సజ్, పోలీస్‌సిబ్బంది సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. సోంపేట, కంచిలి మండలాలకు ఆనుకొని ఉన్న గొంగాపూర్, రామచంద్రపూర్ గ్రామాల సరిహద్దులో నిల్వ ఉంచిన బెల్లం ఊటలు, నాటుసారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు. ఆయా గ్రామాల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 7600 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊట, రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 380 లీటర్లు నాటుసారాను ధ్వంసం చేశారు. ఈదాడుల్లో సోంపేట, పలాస, కోటబొమ్మాళి టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సిబ్బంది, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కుమార్, మురళీధర్, సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి.రమణ, పలాస సీఐ మల్లికార్జునరావు, టాస్క్‌ఫోర్స్ సీఐ మధుకుమార్, సిబ్బంది, ఒడిశా పోలీసులు పాల్గొన్నారు.


