తైక్వాండో స్టేట్‌మీట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తైక్వాండో స్టేట్‌మీట్‌ ప్రారంభం

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన క్రీడాకారులు

మూడు రోజులపాటు నిర్వహణ

శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2026 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్దగల వైఎస్సార్‌ కల్యాణ మండపం వేదికగా జరుగుతున్న మూడు రోజుల స్టేట్‌లెవల్‌ తైక్వాండో పోటీల సమరం ఆరంభమైంది. న్యూ ఏపీ తైక్వాండో అసోసియేషన్‌ సౌజన్యంతో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌ ఆధ్వర్యంలో సబ్‌ జూనియర్స్‌, కేడిట్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగంలో పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 700 మంది వరకు బాలబాలికలు, సీ్త్ర పురుషులు హాజరయ్యారు. వీరికి నిర్వహణ కమిటీ ప్రతినిధులు సౌకర్యాలు, వసతులు, భోజన ఏర్పాట్లు కల్పిస్తున్నారు. ఇక్కడ పోటీల్లో విజేతలగా నిలిచిన క్రీడాకారులకు శిక్షణా శిబిరాలను నిర్వహించి.. ఆలిండియా నేషనల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌ పోటీలకు సన్నద్ధం చేస్తామని న్యూ ఏపీ తైక్వాండో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.వేణుగోపాలరావు వెల్లడించారు.

మార్షల్‌ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ..

మార్సల్‌ ఆర్ట్స్‌లో తైక్వాండోకు విశిష్టమైన ఖ్యాతి, గుర్తింపు ఉందని.. ఆత్మరక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ పోటీలను న్యూ ఏపీ తైక్వాండో అససియేషన్‌ కార్యదర్శి, సీహెచ్‌ వేణుగోపాలరావు, అధ్యక్షుడు అచ్చంనాయుడుతో కలిసి సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక వేత్త సూర శ్రీనివాసరావు, ప్రముఖ గ్యాస్ట్రో సర్జన్‌ డాక్టర్‌ గొండు గంగాధర్‌, తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణా స్టేట్‌ కార్యదర్శి కె.శ్రీహరి, తదితరులు ముఖ్య అతిధులగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో తైక్వాండో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు అర్జున్‌రాయ్‌ హారికాప్రసాద్‌, గేదెల ఇందిరాప్రసాద్‌, శాసనం జోగినాయుడు, కొంక్యాన వేణుగోపాలరావు, రెడ్డి శివకుమార్‌, కొమర మోహన్‌కృష్ణ, సుధీర్‌, తారక్‌, వివిధ జిల్లాల తైక్వాండో సంఘాల ప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement