బీఎల్‌ఓ పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఓ పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

రణస్థలం: మండలంలోని వెల్పురాయి గ్రామంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బీఎల్‌ఓ పనితీరు సక్రమంగా లేదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పండ్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఆ గ్రామంలో 142 పోలింగ్‌ బూత్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై గురువారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సంద ర్భంగా 2002 ఓటర్‌ జాబితాలో లింకు లేని ఓట ర్లు, చిరునామా, పేర్లు తప్పులు, స్వగ్రామంలో ఓటు ఉన్నా ఆ సమయంలో అందుబాటులో లేని ఓటర్లకు నోటీసులు జారీ చేశారని ప్రశ్నించారు. అలాగే వీటిని మీరు ఎలా పూర్తి చేస్తున్నారని ప్రశ్నించగా బీఎల్‌ఓ మేదరమెట్ల రమణమ్మ సమాధానం చెప్పలేకపోవడం, బీఎల్వో అనుమతి పత్రం సక్రమంగా నింపలేకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయమని సిబ్బందికి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement