నరసన్నపేట: జిల్లాలో వరి సాగు చేస్తున్న 4.24 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, వర్షాలు కురవని పరిస్థితుల్లో నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాల ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాలో ప్రభు త్వం విఫలమైందని ఆరోపించారు. సాగునీరు సక్ర మంగా అందించకపోతే సీజన్ మొత్తం నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. వంశధార కాలువల్లో నీరు వస్తున్నా రైతుల పొలాలకు నీరు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వరి వెద పొలాలు ఎండకు ఎండిపోతున్నాయని, ఒక్క తడి అయినా రైతులకు అందించాలని, ఈ మేరకు కాలువల నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు. నరసన్నపే ట నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. పోలాకి, మబగాం, జలుమూరు వంటి ఓపెన్ హెడ్ చానల్స్‌లో నీరు రావడం లేదని తెలిపారు. వంశధార నదిలో ఇసుక తవ్వకాల సందర్భంగా ఈ చానల్ వద్ద ఇసుక మేటలు వల్ల ఓపెన్ హెడ్ చానెల్స్‌లో నీరు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అధికారులు నదిలో ఇసుక మేటలు తొలగించి ఓపెన్ హెడ్ చానల్స్‌లో నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.


