శ్రీకాకుళం పాతబస్టాండ్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ, సకాలంలో పరీక్షలు, చికిత్స, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన ఇంటెన్సిఫైడ్ ఐసీఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రచార వాహనాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయ ఆవ రణలో బుధవారం ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలు, భ యాలు తొలగించి, సరైన అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ‘తెలుసుకుందాం – పరీక్ష చేయించుకుందాం–చికిత్స పొందుదాం–ఆరోగ్యంగా జీవిద్దాం’ అనే సందేశంతో ప్రచార కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నారు.


