నిందితుడికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

నిందితుడికి రిమాండ్‌

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

రణస్థలం: మండలంలోని పైడిభీమవరం పంచాయతీ సరగడపేట గ్రామానికి చెందిన కోల మహాలక్ష్మి(40) ఈనెల 8వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు జేఆర్‌పురం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ వి.సత్యనారాయణ జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల మేరకు.. కోల మహాలక్ష్మి పైడిభీమవరంలోని ఒక పరిశ్రమలో, భర్త కోల పోతయ్య మరో పరిశ్రమలో కాంట్రాక్ట్‌ వర్కర్లుగా పని చేస్తున్నారు. ఈనెల 8వ తేదీన భార్యపై ఉన్న అనుమానంతో ఇంట్లో ఇరువురు గొడవపడ్డారు. దీంతో భర్త పోతయ్య ఆవేశంలో భార్యపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం చీరతో కిటికీకి వేలాడదీసి ఉరిపోసుకుని చనిపోయినట్లు నమ్మించాడు. దీనిపై మృతురాలి తల్లి పల్లి ఎరుకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోజు శవపంచనామ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతురాలి భర్త పోతయ్యను విచారించగా తానే హత్య చేసినట్లు అంగికరించాడు. దీంతో మృతుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement