పోలీసు శిక్షణ కేంద్రం సందర్శన | - | Sakshi
Sakshi News home page

పోలీసు శిక్షణ కేంద్రం సందర్శన

Aug 12 2026 3:16 AM | Updated on Aug 12 2026 3:16 AM

పోలీసు శిక్షణ కేంద్రం సందర్శన

శ్రీకాకుళం రూరల్‌: తండేవలసలో గల పోలీసు శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇండోర్‌, ఔట్‌డోర్‌ ఫైనల్‌ పరీక్షలు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. శిక్షణలో ఉన్న అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలీసు శాఖలో కొత్తగా చేరుతున్న సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా విధి నిర్వహణలో మరింత సామర్థ్యంతో పనిచేసేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement