న్యూస్‌రీల్
‘ఇంతి’ంటా ఆదాయంకొండచీపుళ్లు ఆదాయ వనరుగా మారాయి. సీతానగరం మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. –8లో
అపురూప సంపదకు
● శ్రీముఖలింగంలో పాడైపోతున్న అపురూప శిల్ప కళ ● జీర్ణావస్థకు చేరుతున్న సాక్షి గణపతి, చండికేశ్వరుడు, నంది తదితర విగ్రహాలు ● పట్టించుకోని దేవదాయ శాఖ
శ్రీముఖలింగం దేవాలయం
జలుమూరు:
సాక్షి గణపతి, డుండీ గణపతి, చండికేశ్వరుడు, ఏకపాద మూర్తి.. ప్రతి ఆలయంలోనూ కనిపించే విగ్రహాలు కావు ఇవి. శ్రీముఖలింగంలో వందల ఏళ్లుగా కొలువై పూజలు అందుకున్న ఈ అరుదైన విగ్రహాలు అపాయంలో పడ్డాయి. నిర్వహణ లేక, పట్టించుకునే వారు కానరాక ఈ అపురూప శిల్ప సంపద జీర్ణావస్థకు చేరుకుంటోంది. శిల్పాలపై పగుళ్లు చూసి భక్తుల గుండెలు పగులుతున్నాయి.
సరైన సంరక్షణ లేకపోవడంతో విగ్రహాలు ఎండకు ఎండి, వర్షాలకు తడిచి వాటి అసలు రూపం కోల్పోతున్నాయి. ఇందులో కొన్ని విగ్రహలు పూర్తిగా శిథిలమై రూపురేఖలు మారిపోగా మరి కొన్ని ముఖం, తల, చేతులు, కడుపు, కళ్లు, ముక్కుతోపాటు ఆయా శివలింగాల పానపట్టాలు కూడా పూర్తిగా రూపం కోల్పోతున్నాయి. శివరాత్రి, కార్తీక మాసాల్లో లక్షలాది మంది ముఖలింగేశ్వరుడి దర్శనానికి వస్తారు. ఏడాది పొడవునా భక్తులు వేల సంఖ్యలో వస్తూనే ఉంటారు. ఇంత విశిష్టత, ప్రాముఖ్యత ఉన్న ఈ దేవాలయంలో విగ్రహాలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


