వజ్రపుకొత్తూరు రూరల్: చీపురపల్లి పంచా యతీ పరిధిలో గల సంతోష్ నగర్‌లో సోమ వారం రాత్రి రెండు ఎలుగులు హల్‌చల్ చేశాయి. గ్రామానికి ఆనుకొని ఉన్న జీడి తోటల వెంబడి సంచరిస్తూ ఆహారం వేట సా గించాయి. ప్రస్తుతం పనస పండ్లు సీజన్ కావడంతో ఎలుగులు వాటిని తినేందుకు తోటల్లోకి ప్రవేశించాయి. అక్కడ నుంచి గ్రామ వీధుల్లోకి ప్రవేశించిన ఎలుగులను స్థానికులు గమనించారు. దీంతో కొంత మంది ప్రాణ భయంతో పరుగులు తీయగా.. మరి కొందరు కేకలు వేశారు. అయినప్పటికీ ఎలుగులు కదలకపోవడంతో వాటిపై రాళ్లు విసిరారు. అవి కూడా రా ళ్లు విసిరాయని స్థానికులు చెప్పడంగమనార్హం. కొంత కాలంగా ఎలుగుల సంచారం లేనప్పటి కీ సోమవారం రాత్రి ఒక్కసారిగా రెండు ఎలుగులు సంచరించడంతో ఉద్దానంప్రజలకు మళ్లీ ఎలుగు గుబులు పట్టుకుంది.
శ్రీకాకుళం అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బుధవా రం శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూఎఫ్‌బీయూ కన్వీనర్ బి. శ్రీనివాసులు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని, ఇత ర పెండింగ్ డిమాండ్ల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం శ్రీకాకుళంలోని జీటీరోడ్‌లోని సీఎంఆర్ షాపింగ్‌మాల్ వద్దనున్న డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్ర ల్ బ్యాంక్ వద్ద అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగులు బుధవారం సాయంత్రం 5:30 నిమిషాలకు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారని తెలియజేశారు. ప్రపంచంలో ని అన్ని దేశాల్లో 5 రోజుల బ్యాంకింగ్ అమల్లో ఉందని, భారతదేశంలో కూడా ఐదురోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగు లు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి, ఐబీఏకు తమ నిరసన తెలియజేయనున్నారు.
గార: ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవా లని జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ ఎస్.నాగమణి అన్నారు. మంగళవారం మండలంలోని నిజామాబాద్, శ్రీకూర్మంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రస్తుత నెల కొన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అనుకూలమైన అపరాలు, కంది వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు లాభదాయకంగా ఉంటుందన్నారు. ప్రధాన మంత్రి పంటల బీ మా యోజన పథకాన్ని రైతులంతా సద్విని యోగం చేసుకోవాలని, ఈ నెల 15 వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు.


