సగం డబ్బులేనా..
రమ్మన్నారు.. పొమ్మన్నారు.
● ఏళ్లు గడిచినా అందని టిడ్కో డబ్బులు ● ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడిన లబ్ధిదారులు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ):
పన్నెండేళ్ల కిందట 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో శ్రీకాకుళం నగరంలో వేలాది మంది వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసింది. 2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు టిడ్కో ఇళ్ల పేరుతో ప్రజల వద్ద నుంచి రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేలు చొప్పున సుమారు రూ.20కోట్లకుపైగా తీసుకున్నా రు. అనధికారికంగా ఆ సమయంలో కొందరు టీడీ పీ నాయకులు రూ.లక్షల్లో దండుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. కేటగిరీ–1 వారు 430 చదరపు అడుగులకు రూ.లక్ష, కేటగిరీ–2 కింద 365 చద రపు అడుగుల విస్తీర్ణం గల ఇంటికి రూ.50 వేలు, కేటగిరీ–3 కింద 300 చదరపు అడుగులకి రూ.25వేలు చొప్పున కలెక్షన్ చేశారు. మొత్తం 3820 మంది వద్ద డబ్బులు తీసుకున్నారు. కానీ లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వలేదు. లబ్ధిదారులు టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగీ తిరిగీ విసుగు చెందారు.
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యా యం చేసింది. అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను పూర్తిగా నిర్మించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ప్రక్రి య పూర్తిచేసింది. అన్ని రకాల హక్కులు కల్పించి 2022లో టిడ్కో ఇళ్లను 1904మందికి అందించింది. మిగిలిన 1916 మంది లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించేందుకు అన్ని రకాల వివరాలు సేకరించి ఇచ్చేద్దామన్న సమయానికి 2024లో ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. అన్ని ప్రక్రియలూ పూర్తయినా టిడ్కో లబ్ధిదారులకు టీడీపీ ప్రభుత్వం డబ్బులు తిరిగి చెల్లించలేదు.
మాటలకు చేతలకు కుదరని పొంతన
శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో టిడ్కో లబ్ధిదారులందరికీ చెక్కులు ఇచ్చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్, టీడీపీ ఇన్‌చార్జిలు ప్రచా రం చేశారు. దీంతో లబ్ధిదారులంతా మంగళవారం ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు. తీరా చూస్తే రూ.10.50కోట్ల మోడల్ చెక్కును ఎమ్మెల్యే ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. సమయం లేనందున కేవలం ఓ పదిమందికి చెక్కులు ఇస్తాను. మిగిలిన వారంతా మీ ప్రాంతాల్లోని సచివాలయాల్లో చెక్కులు తీసుకోవాలి’ అని చెప్పారు. అంతేకాకుండా సగం మందికే ఇప్పుడిస్తాం.. మరో పది రోజుల్లో మిగతా సగం మందికి ఇస్తామన్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తెల్లవారుజాము నుంచి డబ్బు లు వస్తాయని ఆశగా ఎదురుచూస్తుంటే.. ఉసూరుమనిపించారని వాపోయారు.
365 చదరపు అడుగుల టిడ్కో ఇంటి కోసం 2018 లో రెండు డీడీలు తీశా. 2018 డిసెంబర్ 20 తేదీన రూ.25వేలు, 21వ తేదీన రూ.25వేలు కట్టాను. ఎనిమిదేళ్లు టీడీపీ నాయకుల చుట్టూ తిరిగాను. ఇప్పుడు రూ.25 వేలే ఇస్తామంటున్నారు. నేను 40 ఏళ్లుగా టీడీపీలో ఉన్నా.. నాకే ఇలా చేయడం అన్యాయం.
– బాలసుందరరావు, అరసవల్లి
మెయిన్‌రోడ్డు, హరిజన వీధి, శ్రీకాకుళం.
నా ఆరోగ్యం బాగులేదు. ఎనిమిదేళ్లుగా మా డబ్బుల కోసం తిరుగుతున్నాం. ఎట్టకేలకు చెక్కులు ఇస్తామ ని అంబేడ్కర్ ఆడిటోరి యంకి రమ్మన్నారు. రెండు మూడు గంటలు ఉంచేసి పొమ్మన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఇలా తిప్పించుకోలేదు. వలంటీర్లను ఇంటి కి పంపి జగనన్న ఇల్లు ఇచ్చారు.
– ఇ.లక్ష్మి, బలిజేపల్లివారివీధి, శ్రీకాకుళం కార్పొరేషన్


