మత్స్యకారులను అణగదొక్కేందుకు కూటమి కుట్ర | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులను అణగదొక్కేందుకు కూటమి కుట్ర

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

మత్స్యకారులను అణగదొక్కేందుకు కూటమి కుట్ర

ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన మత్స్యకార సంఘ నాయకులు

సీదిరికి సంఘీభావం తెలిపిన నేతలు

వజ్రపుకొత్తూరు రూరల్‌:

కూటమి నాయకులు మత్స్యకారులను అణగదొక్కేందుకు చూస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి సీదిరి శ్రీదేవితో పాటు మ త్స్యకార నాయకులు ధ్వజమెత్తారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ప్రగతిభవన్‌ వద్ద మత్స్యకార ఐక్యవేదిక నాయకులు పుక్కళ్ల గురయ్యనాయుడు, ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్‌ అధ్యక్షతన ఆదివారం జిల్లా వ్యాప్త మత్స్యకార నాయకు లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మత్స్యకారులు అన్నింటా వెనుకబడి ఉన్నారని, వారిని గుర్తించింది కేవలం వైఎస్సార్‌ కుటుంబమేనని గుర్తు చేశారు. అప్పట్లో జుత్తు జగన్నాయకులుకు వైఎస్‌ రాజశేఖర రెడ్డి పార్టీలో సముచిత స్థానం కల్పించారని, వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీదిరి అప్పలరాజును మంత్రి పదవిలో కూర్చోబెట్టారని తెలిపారు. మూలపేట పోర్టు, ఫిషింగ్‌ హార్బర్లు, జెట్టీల నిర్మాణం వంటివి వైఎస్‌ జగన్‌ ఘనతలని తెలిపారు. రాజకీయంగా కూడా ఎందరో మత్స్య కారులను మండల నుంచి జిల్లాస్థాయిలో ఉన్నత స్థానాలు కల్పించారని చెప్పారు. కిడ్నీ ఆస్పత్రి, వైఎస్సార్‌ సుజలధార వంటి ప్రాజెక్టుల వెనుక సీదిరి అప్పలరాజు కృషి ఉందన్నారు. అప్పలరాజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూడలేక రాజకీయ కక్షతో అక్రమంగా కేసులు కట్టి అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ప్రమాదాలు చేసి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి మంత్రి లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేయడం అవివేకమని అన్నారు. మత్స్యకార నాయకులను రాజకీయ కక్షతో అణగ దొక్కాలని చూస్తే మత్స్యకారులు సంఘటితంగా ఉద్యమించి రానున్న ఎన్నికల్లో కూట మిని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు.

సమావేశంలో జిల్లా మత్స్యకార నాయకులు, ఐక్యవేదిక నాయకులు అంబటి ఆనంద్‌, వంక రాజు, తిర్రి రాజారావు, మూగి గురుమూర్తి, కొమ ర వాసు, జోగి రాములమ్మ, అంబటి శ్రీను, కోనా డ నర్సింహులు, సూరాడ సూర్యం, లక్ష్మణ్‌, గురు ప్రసాద్‌, జోగి అప్పారావు, డొంక విద్యాసాగర్‌, ఎస్‌.వెంకన్న, మూగి రామారావు, ఎం.సోమయ్య, ఉప్పాడ అప్పన్న, ఎం.కామరాజు, బుడగట్ల లక్ష్మ ణ్‌, బి.రాంబాబు, ఎ.అప్పన్న, మైలపల్లి పట్టయ్య, ఎన్‌.పైదయ్య, గుంటు లోకనాథం, ఎం.శ్రీనివాస్‌, పి.శ్రీరామమూర్తి, సీదిరి త్రినాథ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement