పాతపట్నం: ఆమదాలవలస నియోజకవర్గ వై ఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవి కుమార్‌ను శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెం దగ్గర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోనికి తీసుకుని, అర్ధరాత్రి పాతపట్నం పోలీసు స్టేష న్‌కు తీసుకువచ్చారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 4 ఎస్‌ఐలు, 15 మంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది, 20 మంది ఏఆర్ పోలీసులు, పాతపట్నం సర్కిల్ పోలీసులు సమక్షంలో చింతాడ రవి కుమార్‌ను ఉంచారు. ఆదివారం ఉయదం ఎనిమిదిన్నర గంటల సమయంలో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావుతో పాటు సోంపేట, నరసన్నపేట, సీసీఎస్ సీఐలు జి.మంగరాజు, ఎం.శ్రీనిసరావు, బి.చంద్రమౌళి, ఆమదాలవలస ఎస్‌ఐ బాలరాజు పాతపట్నం పోలీసుస్టేషన్‌కు చేరుకుని చింతాడ రవి కుమార్‌ను సుధీర్ఘంగా విచారించారు. సాయంత్రం 4.30 గంటలకు పాతపట్నం సీహెచ్‌సీకు చింతాడ రవి కుమార్‌ను తీసుకువెళ్లి వైద్య పరీక్షలను పోలీసులు చేయించారు. అనంతరం పాతపట్నం సీహెచ్‌సీ నుంచి శ్రీకాకుళం కోర్టులో జడ్జి ముందు హాజరు పరిచేందుకు రవికుమార్‌ను పోలీసు వాహనంలో తీసుకువెళ్లారు. చింతా డను పాతపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారనే సమాచారం రావడంతో వైఎస్సార్ సీపీ నాయకులు పాతపట్నం చేరుకున్నారు. అ యితే పోలీసులు ఎవరినీ లోపలకు రానివ్వ లేదు. రాజకీయ కక్ష సాధింపులకు పోలీ సు లను వినియోగిస్తున్నారని పాతపట్నం వైఎస్సా ర్‌సీపీ నాయకులు అన్నారు.
మళ్లీ ఆక్రమణలు నరసన్నపేటలో మళ్లీ ఆక్రమణలు జరుగుతున్నాయి. పాలకర్ర చెరువు వద్ద ఇవి కనిపిస్తున్నాయి. –8లో
Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM
మళ్లీ ఆక్రమణలు నరసన్నపేటలో మళ్లీ ఆక్రమణలు జరుగుతున్నాయి. పాలకర్ర చెరువు వద్ద ఇవి కనిపిస్తున్నాయి. –8లో అర్ధరాత్రి పాతపట్నం
పోలీస్‌స్టేషన్‌కు..
Advertisement


