జూనియర్‌ డాక్టర్లతో చర్చలు | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ డాక్టర్లతో చర్చలు

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

జూనియర్‌ డాక్టర్లతో చర్చలు ఉత్సాహంగా జిల్లా స్థాయి ర్యాపిడ్‌ చదరంగం పోటీలు ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు అనారోగ్యం ‘పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు’

శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్‌ డాక్టర్లు, పీజీ లు, హౌస్‌ సర్జన్లను రాష్ట్ర వైద్య శాఖ అధికారు లు చర్చలకు పిలిచారు. సోమవారం నుంచి వీరంతా మూడు ప్రధాన డిమాండ్లతో సమ్మె చేయాలని నిర్ణయించిన విషయం పాఠకులకు విధితమే. ఈ సమ్మెకు సంబంధించి ఆదివారం అధికారులకు నోటీసులు ఇవ్వగా సోమవారం చర్చలకు రావాలని కోరారు. నోటీసులు ఇచ్చి న సమయంలోనే స్టైఫండ్‌ పెంచేందుకు సానుకూలంగా స్పందించిన అధికారులు మిగిలిన రెండు డిమాండ్లపై చర్చించేందుకు రావాలని కోరడంతో వీరు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే సోమవారం నాడు వీరంతా విధులకు హాజరైనప్పటికీ నల్ల బ్యాడ్జీ లు ధరించి హాజరవ్వాలని నిశ్చయించుకున్నా రు. సోమవారం నాటి చర్చలు సానుకూలంగా జరిగే పక్షంలో పునరాలోచన చేయాలని యోచిస్తున్నారు. మిగిలిన రెండు డిమాండ్లకు అంగీకరించని పక్షంలో మంగళవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలోని నానుబాలువీధిలో గల చెస్‌ శిక్షణ కేంద్రంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి ర్యాపిడ్‌ చదరంగం పోటీ లు ఉత్సాహంగా సాగాయి. శ్రీకాకుళానికి చెందిన బగాది కార్తికేయ నాలుగున్నర పాయింట్ల తో ప్రథమ స్థానం సాధించగా, బొల్ల శతి ద్వితీ య స్థానం, పలాసకు చెందిన జ్యోతిక్‌, షగున్‌ 3,4 స్థానాల్లో, శ్రీకాకుళానికి చెందిన కూన సందేశ్‌ కుమార్‌ ఐదో స్థానం, లిపిక 6వ స్థానం, టెక్కలి కి చెందిన సనపల రిత్విక్‌ సాయి 7వ స్థానంలో నిలిచారు. వీరిని ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ చెస్‌ ఇన్‌ స్కూల్‌ ట్రైనర్‌ సనపల భీమారావు అభినందించారు. వీరంతా ఈ నెల 15,16 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రస్థాయి రాపిడ్‌ చదరంగం పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

మెళియాపుట్టి: మండలంలోని బందపల్లి గిరిజ న సంక్షేమ పాఠశాలలోని ఐదుగురు విద్యార్థినులు అనారోగ్యంతో బాధ పడుతూ టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరు విరేచనాలతో, నలుగురు జ్వరంతో బాధ పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర ఆదివారం టెక్కలి ఆస్పత్రిని సందర్శించి విద్యార్థినులను పరామర్శించారు. అనంతరం బందపల్లి ఆశ్ర మ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మా ట్లాడారు. పాఠశాల పరిసరాలు పరిశీలించారు.

కవిటి: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను తక్షణమే రద్దు చేసి, ఉద్యోగులందరికీ పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను వెంటనే పునరుద్ధరించాలని ఓపీఎస్‌ ఉద్యమసంఘం డిమాండ్‌ చేసింది. ఆదివారం కవిటిలో ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సెప్టెంబర్‌ 1 పెన్షన్‌ విద్రోహ దినం, గుంటూరులో సమర శంఖం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం నిశ్చితమైన పెన్షన్‌ అందుకోవడం హక్కు అని స్పష్టం చేశారు. ‘పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు’ అనే నినాదంతో సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తోందని వారు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లోపు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ ను అమలు చేయాలి అని అల్టిమేటం జారీ చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement