ప్రైవేటు దందా! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు దందా!

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

ప్రభుత్వ ఆస్పత్రి పేరుతో

ఇచ్ఛాపురం రూరల్‌: పాతిక గ్రామాల కలలను సాకారం చేస్తూ రూ.1.85 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈదుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుస్తీ చేసింది. మత్స్యకార గ్రామాలతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2024 ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు. రోగుల తాకిడి దృష్ట్యా ఈ ఆస్పత్రికి ప్రభుత్వం ఇద్దరు వైద్యులతో పాటు సిబ్బందిని నియమించింది. కానీ వైద్యులు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఉండరో తెలీక రోగు లు తికమక పడుతూ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్ర యిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించాల్సిన ప్రధాన వైద్యాధికారి ఇచ్ఛాపురంలో తన సొంత ఆస్పత్రికే పరిమితమయ్యారు. ఉద యం పది గంటలకు ప్రభుత్వాస్పత్రిలో ఉండాల్సిన ఈ వైద్యుడు పదకొండున్నర గంటలకు ఆస్పత్రికి చుట్టం చూపుగా వస్తూ స్థానిక బాహుదా నది బ్రిడ్జి వద్దనే ముఖ హాజరు వేసుకుంటూ వెళ్లిపోతుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయనకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో సిబ్బంది సైతం ఆయన ముందు నోరు మెదిపేందుకు జంకుతుంటారు. ఈయన ఈ ఆస్పత్రికి డీడీఓగా వ్యవహరిస్తున్నారు.

ఇచ్ఛాపురం వచ్చేయండీ..

ఎముకల విభాగంలో స్పెషలిస్ట్‌ అయిన ఈ వైద్యు డు ఇచ్ఛాపురం పట్టణంలోని చిన్న మేదర వీధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నడుపుతున్నారు. కండరాలు, ఎముకలు వంటి సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వివిధ కారణాలు చూపుతూ తన ప్రైవేటు ఆస్పత్రికి పంపుతుంటారని స్థానికులు చెబుతున్నారు. గత నెల మార్చిలో సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మో చేయి బెణికిందంటూ ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే, ఈ వైద్యుడు ఇచ్ఛాపురంలోని తన సొంత ఆస్పత్రిలో చికిత్స చేసి సుమారు ఐదు వేల రూపాయల వరకు చెల్లించినప్పటికీ ఫలితం కనిపించలేదని, ఇక డబ్బులు చెల్లించలేక మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్లానని ఆమె తెలిపారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుచరుడినని చెప్పుకుంటూ ఎవ్వరూ తనను ప్రశ్నించలేరన్న ధైర్యంతో వ్యవహరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఫిర్యాదు చేసినా..

మా గ్రామంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న ఆయన సమయానికి ఆస్పత్రికి వచ్చే రోజులు చాలా తక్కువ. ఎక్కువ సమయంలో తన సొంత ఆస్పత్రిలో గడిపే ఈ వైద్యుడు చుట్టం చూపుగా ప్రభుత్వ ఆస్పత్రికి వస్తుంటారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండటమే ప్రధాన కారణం. సొంత ఆస్పత్రే ఆయనకు ముఖ్యం. ఈయనపై పలుమార్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.

– నర్తు ప్రేమ్‌కుమార్‌ యాదవ్‌, ఈదుపురం

పేరుకే ఇద్దరు వైద్యులు

విధులు నిర్వహిస్తోంది ఒక్క వైద్యురాలే

చుట్టం చూపుగా విధులకు హాజరవుతున్న వైద్యుడు

ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు సొంత ఆస్పత్రిలో వైద్యం

ఇచ్ఛాపురం వెళ్లి వైద్యం చేయించుకున్నా...

మోచేయి బెణికిందని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ఇచ్ఛాపురంలో తన సొంత ఆస్పత్రిలో చికిత్స చేశారు. మందులు, వైద్యం ఖర్చులు మొత్తం ఐదువేల రూపాయల వరకు ఖర్చయ్యింది. కానీ తగ్గకపోవడంతో మళ్లీ ప్రభు త్వ ఆస్పత్రికి వచ్చి సూది మందు వేసుకున్నాను.

– పి.సరస్వతి, రోగి, సన్యాసిపుట్టుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement