ఎర్రన్నాయుడు మరణంలో నీ హస్తం లేదా..? | - | Sakshi
Sakshi News home page

ఎర్రన్నాయుడు మరణంలో నీ హస్తం లేదా..?

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

మంత్రి అచ్చెన్నాయుడి పై విమర్శలు ఎక్కుపెట్టిన పేరాడ తిలక్‌

మహానేత మరణంపై అచ్చెన్న వ్యాఖ్యలపై భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

టెక్కలిలో అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మ దహనం .. మానవహారంతో నిరసన

అచ్చెన్న వ్యాఖ్యలు అహంకారపూరితం

టెక్కలి:

హానేత మరణంపై, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడుపై వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ దుమ్మెత్తిపోశారు. ఎర్రన్నాయుడు మరణం వెనుక అచ్చెన్నాయుడు ఉన్నారని ఈ జిల్లా అంతటికీ తెలుసని అన్నారు. టెక్కలి వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎర్రన్నాయుడు మరణం వెనుక అచ్చెన్నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. తన ఎదుగుదలకు ఎర్రన్న అడ్డుగా ఉన్నాడని పలు సందర్భాల్లో అచ్చెన్నాయుడు అన్నారని తిలక్‌ గుర్తు చేశారు. మూలపేట పోర్టు సభ విజయవంతం తర్వాత అచ్చెన్నాయుడుకు భయం పట్టుకుందన్నా రు. తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా సంస్కార హీనంగా మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తిలక్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ ఎన్‌.శ్రీరామ్మూర్తి, పార్టీ మండల అధ్యక్షులు హెచ్‌.వెంకటేశ్వరరావు, ఎస్‌.హేమసుందర్‌రాజు, టి.ఫల్గుణరావు, పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, పార్టీ నాయకులు వై.చక్రవర్తి, వైస్‌ ఎంపీపీ పి.రమేష్‌, పి.వెంకట్రావు, కె.అజయ్‌, వి.శ్రీధర్‌రెడ్డి, ఎన్‌.సాబతో, బి.కార్తీక్‌, బి.రాజేష్‌, కె.జీవన్‌, జి.మోహన్‌రెడ్డి, పి.శ్రీను, కె.కామేష్‌, కె.సంజీవ్‌, జె.తిరుమలరెడ్డి, బి.ఎల్లయ్య, బి.కూర్మారావు, ఎ.రాహుల్‌, బి.రాకేష్‌, పి.కృష్ణ, బి.శ్రీను, పి.శివ, కె.రామరాజు, డి.కామన్న, ఎస్‌.వెంకటరమణ, బి.జయరాం, ఎ.విష్ణు, శివారెడ్డి, రామయ్య, ఆర్‌.మురళీరెడ్డి, డి.లోకేష్‌రెడ్డి, కె.చిన్న, గౌడ శ్రీనివాస్‌, చింతాడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

నరసన్నపేట: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అచ్చెన్నాయుడు స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంతకాల సేకరణ అంటూ అచ్చెన్న అసత్యాలు చెబుతున్నారని, ఆనాడు ప్రత్యక్షంగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న ప్రకటనలు అచ్చెన్నాయుడు గమనించాలన్నారు. అభివృద్ధిని మరిచి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందన్నారు. స్థాయిని మరిచి విమర్శలు చేయడం మానుకోవాలని హితబోధ చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించిన మావిగన్‌ విషయంలో అధికార పార్టీ విమర్శలు అర్ధ రహితమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement