శ్రీకాకుళం: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఫ్యాఫ్టో చైర్మన్ బి. శ్రీరామమూర్తి కోరారు. గురు వారం శ్రీకాకుళంలోని పదో తరగతి స్పాట్ కేంద్రం వద్ద రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్ , జీపీఎస్ వి ధానాలు రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. 2003లో నియామ కం పొందిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. సరెండర్ లీవ్‌లు, డీఏ బకాయిలు తక్షణమే చెల్లించాలని, 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు చేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ సంబంధించి జీఓ నంబర్ 72,73,74 అమలుపరచాలని, ఆంగ్లమాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
స్పాట్ కేంద్రంతో పాటు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టి నినాదాలు చేశారు.


