రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Mar 20 2026 7:51 AM | Updated on Mar 20 2026 7:51 AM

రాష్ట్ర స్థాయి ఉత్తమ పశు వైద్యాధికారిగా కిరణ్‌కుమార్‌

ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్‌ నుంచి ఉర్లాం రైల్వే స్టేషన్‌ వెళ్లే మార్గ మధ్యంలో గురువారం రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారని శ్రీకాకుళం రోడ్డు జీఆర్పీ ఎస్‌ఐ ఎం.మధుసూదన రావు తెలిపారు. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి శ్రీకాకు ళం సర్వజన ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించామని తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, సమాచారం తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.

బంగారం కొనుగోలులో

గందరగోళం

కొత్తూరు: ఉగాది నాడు కొత్తూరులో బంగారం కొనుగోలుదారులు గందరగోళానికి గురయ్యారు. ఉగాది నాడు బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి సంప్రదాయం. ఉగా ది రోజు ఉదయం ఒక గ్రాము బంగారం ధర రూ.15,800 చూపించింది. సాయంత్రానికి రూ.14,900కు తగ్గింది. అయితే కొత్తూరులోని పలు షాపుల్లో తగ్గిన ధర కాకుండా ఉదయం ధరకే బంగారం విక్రయించారు. కొనుగోలుదారులు తర్వాత విషయం తెలుసుకుని నష్టపోయామని లబోదిబోమన్నారు. ఒకే ఊరిలో ఒక్కో షాపులో వేరు వేరు ధరలతో బంగారం విక్రయాలు జరగడంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

గేట్‌లో ఆల్‌ ఇండియా 248వ ర్యాంక్‌

పొందూరు: మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన మొదలవలస రాజ్‌కుమార్‌ గేట్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ప్రతిభ కనబరిచాడు. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గేట్‌ ఫలితాలలో ఆల్‌ ఇండియా స్థాయిలో ర్యాంక్‌ 248 పొందాడు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ ఐఐటీ ధన్‌బాద్‌లో కృత్రిమ మేథస్సు, డేటా సైన్స్‌ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. రాజ్‌కుమార్‌ తండ్రి మొదలవలస గోవిందరావు మెడికల్‌ బిజినెస్‌ చేస్తుంటారు. తల్లి మొదలవలస జయసుధ గృహిణి.

గేట్‌లో 544వ ర్యాంకు

సంతబొమ్మాళి: బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామానికి చెందిన పిలక పవన్‌కుమార్‌ గేట్‌ ఎంట్రన్స్‌టెస్ట్‌లో ఆల్‌ ఇండియాలో 544వ ర్యాంకు సాధించారు. ప్రాథమిక విద్య బోరుభద్రలోని ప్రైవేటు పాఠశాలల్లో, వెన్నెలవలస నవోదయలో ఇంటర్మీడియెట్‌ వరకు చదివాడు. ఫిబ్రవరి 8న జరిగిన గేట్‌ ఎంట్రన్స్‌ లో ఆల్‌ ఇండియా ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు రమేష్‌బాబు, కళావతమ్మ గ్రామస్తులు అభినందించారు.

టెక్కలి: కోటబొమ్మాళి మండలం కురుడు వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ లఖినేని కిరణ్‌కుమార్‌ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశు వైద్యాధికారిగా ఎంపికై గురువారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అవార్డును అందుకున్నారు. పశువుల పునరుత్పత్తి విభాగంలో 2012 – 2026 వరకు కృత్రిమ గర్భధారణ లక్ష్యాలను పూర్తి చేయడంలో కిరణ్‌కుమార్‌ చేసిన సేవలకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాతో పాటు టెక్కలి డివిజన్‌ పరిధిలో గల పశు సంవర్ధక శాఖ సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement