జిల్లాలో గ్యాస్‌ కొరత లేదు: జేసీ | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో గ్యాస్‌ కొరత లేదు: జేసీ

Mar 14 2026 7:24 AM | Updated on Mar 14 2026 7:24 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలోని జీటీ రోడ్డులో జోయాలుక్కాస్‌ జ్యూయలరీ నూతన షోరూం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ థామస్‌ మాథ్యూ, మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. దేశంలో తమ సంస్థ విస్తరించడంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజుల్లో నాలుగు కొత్త షోరూ మ్‌లు ప్రారంభించామని థామస్‌ మాథ్యూ అన్నా రు. ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలు వినియోగదారుల బలమైన డిమాండ్‌కు అనుగుణంగా అందించి విశ్వసనీయతకు మారుపేరుగా జోయాలుక్కాస్‌ బ్రాండ్‌ను విస్తరింపజేస్తామన్నారు. ఆభరణాల తయారీ చార్జీలపై ఫ్లాట్‌ 40 శాతం తగ్గింపుతో ప్రారంభ ఆఫర్‌ ఇస్తున్నామని, మార్చి 29 వరకు నడుస్తుందన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ముంబై, బెంగుళూర్‌కు చెందిన మోడల్స్‌ పాల్గొన్నారు.

సిక్కోలుకే తలమానికం..

సిక్కోలు నగరానికే తలమానికంగా జోయాలుక్కా స్‌ జ్యూవెలరీ షాపు నిలుస్తుందని, మహిళలకు చూడగానే ఆకట్టుకునేలా సరికొత్త డిజైన్లతో కూడిన ఆభరణాలు, వజ్రాల నెక్లెస్‌లు.. మగవారి హుందాకు తగ్గట్టుగా రూపొందించిన ఉంగరాలు, బ్రాస్‌లెట్‌లు చూడముచ్చటగా ఉన్నాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం జీటీరోడ్డులో ప్రారంభమైన షోరూమ్‌ను ధర్మాన సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర పార్టీ ఎస్‌ఈసీ మెంబర్‌ చల్లా శ్రీనివాసరావు, మండవిల్లి రవి, కోణార్క్‌ శ్రీను, తంగుడు నాగేశ్వరరావు, వూన నాగరాజు తదితరులున్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ప్రస్తుతం వంట గ్యాస్‌ కొరత లేదని, వినియోగానికి సరిపడా ఉందని, అయితే పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్‌లో కొరత ఉండే అవకాశం ఉందని, వినియోగదారులు గ్యాస్‌ ను పరిమితంగా వాడాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మా న్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. జిల్లాలో గృహావసరాలకు అవసరమైన సిలిండర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గల 39 గ్యాస్‌ ఏజెన్సీల వద్ద గ్యాస్‌ సిలిండర్లు లభ్యంగా ఉంచుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నుట్లు తెలిపారు. ఫోన్‌ ద్వారా గానీ, ఆన్‌లైన్‌ ద్వారా గానీ గ్యాస్‌ ఏజెన్సీల వద్ద గానీ నేరుగా గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ చేసుకుంటే, బుకింగ్‌ చేసుకున్న ఒకటి లేదా రెండు రోజుల్లో వారి ఇళ్లకు గ్యాస్‌ సిలిండర్‌లో సరఫరా చేస్తామన్నారు. ఆయిల్‌ కంపెనీ నిబంధనల మేరకు ఓటిపీ, గ్యాస్‌ బుకింగ్‌ మధ్య కాలపరిమితి 25 రోజులు ఉన్నందున, వినియోగదారులు సహకరించాలని కోరారు. వాణిజ్యపరమైన గ్యాస్‌ సిలిండర్ల కోసం భారత ప్రభుత్వం కమిటీని నియమించినందున ఆ కమిటీ వారి నిర్ణయం మేరకు వాణిజ్య సముదాయాలకు, హోటళ్లకు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయనున్న ట్లు తెలిపారు. ఇళ్లు, హాస్టళ్లు, ఆస్పత్రులకు ఎలాంటి ఆటంకం లేకుండా గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement