తగ్గిన సాయం..
● జిల్లాలో 2.79 లక్షల మందికి ‘అన్నదాత సుఖీభవ’ అందజేత
● వైఎస్సార్‌సీపీ హయాంలో ఏటా
3.22 లక్షల మందికి అందిన సాయం
● లబ్ధిదారుల కుదింపుపై సర్వత్రా ఆందోళనలు
● కౌలు రైతులకు అందని సాయం
● నష్టపరిహారం శూన్యం
కౌలు రైతును నట్టేట ముంచారు
వైఎస్ జగన్ హయాంలో కౌలు రైతును ఆదుకున్నారు. ప్రస్తు తం చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులను నట్టేట ముంచుతోంది. కౌలు రైతు కష్టాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించక పోవడం బాధాకరం. జగనన్న హయాంలో కొండపట్టాలకు కూడా రైతు భరోసా అందించేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు.
– డి.జమ్మయ్య, ఆంపురం కౌలు రైతు
ఒక విడతే వచ్చింది
అన్నదాత సుఖీభవ మొదటి వి డత వచ్చింది. రెండోది రాలేదు. వ్యవసాయాధికారుల చుట్టూ తిరిగాను. సచివాలయం సిబ్బందిని కలిశాను. ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. ఎందుకు ఆపేశారో ఇప్పటికీ తెలీదు. గతంలో రైతు భరోసా క్రమం తప్పకుండా వచ్చేది. కూటమి ప్రభుత్వం ఒక విడత ఇచ్చి ఇంకో విడత ఆపేస్తోంది.
– ఇసా బూలోక, రైతు, కామేశ్వరిపేట
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలో అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో 3.22లక్షల మందికి వైఎస్సార్ రైతుభరో సా పేరుతో నిధులు జమ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పూర్తి ఎగ్గొటింది. తరువాత తొలి విడత 2.74 లక్షల మందికి, రెండో విడత 2.79లక్షల మందికి అందించారు. మూడో విడత సైతం అదే తీరుగా ఉంది. ఖరీఫ్ మొదట్లో రైతులకు కావాల్సిన ఎరువులు సకాలంలో అందించక ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అంతేకాకుండా తుఫాన్‌కు నష్టపోయినవారిని సైతం పట్టించుకోకుండా వదిలేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ సై తం అందించక రైతులకు నిరంతరం వేధిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండుగలా జరిగేది. చంద్రబాబు అండ్ కో నిరంతరం ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రైతులకు మేలు జరిగే పనులు చేయడం లేదు. కూటమి పాలనలో ఏడాది పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎగ్గొట్టేసి కేవలం 2.74లక్షల మందికి మాత్రమే అర్హుల జాబితాలో చూపించడమే విడ్డూరం. రెండో విడతకు మొదటి విడతకు కేవలం 5వేలు మందిని అర్హులుగా పెంచడం దారుణమని రైతులు అంటున్నారు. మూడో విడతలో మాత్రం రెండో విడతలో ఎంతమందికి ఇచ్చారో ఇప్పుడూ అంతేమందికి ఇచ్చి మమ అనిపించేశారు. వ్యవసాయశాఖ మంత్రి ఉన్న జిల్లాలో రైతుల సంఖ్య తగ్గిపోయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వైఎస్సార్ సీపీ ఐదేళ్లలో అందించిన సాయమిది
సంవత్సరం రైతుల సంఖ్య లబ్ధి
(రూ.కోట్లలో)
2019–20 2.58లక్షలు 348.50
2020–21 2.91 లక్షలు 393.52
2021–22 3.07లక్షలు 414.57
2022–23 3.10లక్షలు 393.14
2023–24 3.22లక్షలు 434


