● మా హయాంలో పనులు వేగంగా జరిగాయి
● పోర్టు పనుల పురోగతిపై ఈ నెల 30న సందర్శన
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
టెక్కలి: మూలపేట పోర్టు పనులను పూర్తిగా నిర్వీ ర్యం చేసి పోర్టును మూలకు చేర్చే యత్నం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాల కలగా మిగిలిపోయిన ఈ పోర్టును గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పట్టాలు ఎక్కించారని గుర్తు చేశారు. కూటమి సర్కారు అఽధికారంలోకి వచ్చిన తర్వాత పనుల పేరిట కాలయాపన చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోర్టుకు సంబంధించి తమ హయాంలో 85 శాతం మేర పనులు పూర్తిచేశామన్నారు. ఈ పోర్టు పనుల తాజా స్థితిగతులు ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ నెల 30న మూలపేట సందర్శన చేపడతామన్నారు. ఉత్తరాంధ్రలో వైఎఎస్సార్ సీపీకి చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు ప్రస్తుత ఎమ్మెల్సీలతో కలసి శాంతియుతంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని అన్నివర్గాలవారు విజయవంతం చేయాలని కృష్ణదాస్ కోరారు. సమావేశంలో సంతబొమ్మాళి, కోటబొ మ్మాళి జెడ్పీటీసీలు పాల వసంత రెడ్డి, దుబ్బ వెంకటరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామమూర్తి, నాయకులు అన్నెపు రామారావు, చిన్ని జోగారావు, రోణంకి మల్లయ్య, పి.వెంకటరావు, బి.రాజేష్, జయరామ్ తదితరులున్నారు.


