నందిగాం: కాపుతెంబూరు పంచాయతీ లట్టిగాంలో విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లట్టిగాంకు చెందిన గురువెల్లి మురళి(37) మూలపేట పోర్టులో వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. స్నానం చేసి డాబా పైకి బట్టలు ఆరవేయడానికి వెళ్లగా విద్యుత్ లైన్ తగలడంతో షాక్‌కు గురయ్యాడు. గమనించిన భార్య కృష్ణవేణి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మురళికి భార్య కృష్ణవేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


