పెళ్లి పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు

Mar 14 2026 7:21 AM | Updated on Mar 14 2026 7:21 AM

పలాస : సోంపేట మండలం జగతిపురం గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన గాజు అనిల్‌కుమార్‌ అనే యువకుడిని కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ శుక్రవారం వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలోని ఓ పార్లర్‌లో పనిచేసే అనిల్‌కుమార్‌ దుబారా ఖర్చులు చేస్తూ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. దొంగతనాలు చేయడం కూడా ప్రారంభించాడు. ఈ క్రమంలో జగతిపురం గ్రామానికి చెందిన యువతి ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కాశీబుగ్గలోని ఓ లాడ్జికి రప్పించాడు. మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న మూడు తులాల బంగారంతో ఉడాయించాడు. బాధితురాలు ఈ నెల 6న కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు నిందితుడు అనిల్‌కుమార్‌ను విశాఖపట్నంలో అరెస్టు చేశారు. బంగారం సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement