వంతెన నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.20 కోట్లతో టెండర్ పిలవగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయడం దురదృష్టకరం. అంతే కాకుండా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారు. ఈ వంతెనపై ఇప్పటికే మూడుసార్లు విజయవాడ వెళ్లి సంబంధిత ఇంజినీర్‌కు వినతిపత్రాలు అందజేయడం జరిగింది. ఉగాది నాటికి ప్రభుత్వంలో ఈ అంశంపై స్పందన లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో నిరసన తెలుపడం జరుగుతుంది.
– సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త, ఇచ్ఛాపురం నియోజకవర్గం


