వమరవల్లిలో యూరియా పక్కదారి | - | Sakshi
Sakshi News home page

వమరవల్లిలో యూరియా పక్కదారి

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

వమరవల్లిలో యూరియా పక్కదారి

వమరవల్లిలో యూరియా పక్కదారి

● మహాశివరాత్రి రోజున సచివాలయం వద్ద

టీడీపీ నాయకులకు పంపిణీ

గార: రైతులకు అందాల్సిన యూరియాను కేవలం టీడీపీ నాయకులకు అందించడం పరిపాటిగా మారింది. గార మండలంలో వమరవల్లి సచివాలయానికి శనివారం 444 బస్తాల యూరియా స్టాకు తూలుగు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానిది వచ్చింది. సాధారణంగా వ్యవసాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో రైతుల ఆధార్‌, వన్‌బీ ఆధారంగా స్లిప్‌లు అందించాలి. ఆ తర్వాత పీఏసీఎస్‌ సిబ్బంది రైతుల వద్ద డబ్బులు తీసుకొని యూరి యా అందించాలి. అవేమీ లేకుండా స్థానిక టీడీపీ నాయకుల ఆదేశాలతో తూలుగు పీఏసీఎస్‌ సిబ్బంది మహాశివరాత్రి రోజు ఆదివారం సాయంత్రం సచివాలయం వద్దనున్న గోడౌన్‌ తాళాలు తీసి కొందరికి యూరియాను ఇచ్చేశారు. స్థానిక రైతులు కుర్మాన రాజశేఖర్‌, సోమేష్‌లు యూరియా ఇస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లడంతో ఇవ్వకుండా, నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. గట్టిగా నిలదీసేసరికి పీఏసీఎస్‌ సిబ్బంది గోడౌన్‌ షట్టర్లు దించేసి వెళ్లిపోయారు. దీనిపై తహసీల్దార్‌, వ్యవసాయాధికారులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో వ్యవహా రం బయటకు వచ్చింది. రైతులకు యూరియా ఇవ్వకుండా టీడీపీ నాయకులు చెప్పిన వారికే ఇస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement