గుండెలధరతున్నాయి..!
టెక్కలి: రావివలసలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దంపతులు
మహేంద్ర గిరి శిఖరంపై భక్తులు
సగటు జీవి అలసిపోతున్నాడు. చడీచప్పుడు లేకుండా నిత్యావసరాల ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉండడంతో కొనలేక కొయ్యబారిపోతున్నాడు. వచ్చే జీతానికి పెరుగుతున్న ధరలకు పొంతన కుదరకపోవడంతో కుటుంబ పోషణ భారమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. మాకు పెంచడం తప్ప తగ్గించడం రాదనే ధోరణిలో పాలకులు వ్యవహరిస్తుండడంతో ప్రతి నెలా సరుకులు కొనడానికి వెళ్లిన వారి గుండె లు అదురుతున్నాయి.
హిరమండలం:
నిత్యావసరాల ధరలు ఆకాశ యానం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే నిత్యావసరాల ధరలు పెరగనివ్వబోమని బొంకిన నాయకులు ఇప్పుడు ధరల పట్టీలు చూసి నోరెత్తడం లేదు. కంది పప్పు, వేరు శనగ, నూనెల ధరలన్నీ బహిరంగ మార్కెట్‌లో సలసలా కాగుతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు.
సగటు సిక్కోలు కుటుంబాల్లో వేరు శనగల విని యోగం అధికంగా ఉంటుంది. గతంలో కిలో రూ.130 నుంచి రూ.140లకు లభించేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.200కు ఎగబాకింది. జిల్లాలో వేలాది ఎకరాల్లో వేరుశనగ పండించేవారు. కానీ గత ఏడాది విత్తనాలు మొలకెత్తకపోవడం, వాతావరణ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి స్థిరీకరణ జరగకపోవడం వంటి ప్రభావం ఈ ఏడాది సాగుపై పడింది. జిల్లాలో వేరుశనగ సాగు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఈ లెక్కన వేరుశనగ గింజల ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు.
పెరిగిన ధర.. ఆపై మోసం
నూనెల గురించి చెప్పనవసరం లేదు. నెల రోజుల వ్యవధిలో రూ.20 నుంచి రూ.30ల వరకూ పెరిగాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ కిలో ధర జనవరిలో రూ.150 వరకూ ఉండేది. ఈ నెల మొదటి వారంలోనే దాని ధర రూ.167కు చేరుకుంది. వేరుశనగ నూనె కిలో రూ.160 నుంచి రూ.180 వరకూ ఎగబాకింది. పామాయిల్ ప్యాకెట్ (850 గ్రాము లు) రూ.115 నుంచి రూ.130కు చేరింది. కంపెనీలు బట్టి ఒక్క నెలలోనే ధరలు పెరుగుదల కని పించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇటీ వల మార్కెట్‌లో కల్తీ ఆయిల్ రాజ్యమేలుతోంది. ఏది మంచి నూనె.. ఏదీ కల్తీయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
పప్పు దిగనంటోంది..
పప్పులు, మసాలా దినుసుల గురించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఇంటా కందిపప్పు వినియోగం పెరిగింది. కానీ ఒక్క నెలలోనే దాని ధర రూ.40లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జనవరిలో కిలో కందిపప్పు రూ.100గా ఉండేది. ఫిబ్రవరి మొదటి వారానికి రూ.140కు చేరుకుంది. ఎండుమిర్చి కిలో రూ.240 నుంచి రూ.300కు పెరగగా మినపపప్పు కిలో రూ.20 నుంచి రూ.30ల వరకూ పెంచి అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా కూట మి ప్రభుత్వం ధరలను కట్టడి చేసే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ధరలను నియంత్రించాలి
నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగాయి. ఏం కొనేటట్టు లేదు. నూనెల ధరలు సలసలమంటున్నాయి. పప్పు దినుసుల ధరలు అందనంత దూరానికి చేరుకుంటున్నాయి. ధరలను నియంత్రించాల్సిన అధికారులు చేతులెత్తేయడం దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలను నియంత్రించాలి.
– పి.పద్మావతి, గృహిణి, ఎల్‌ఎన్‌పేట
ప్రభుత్వ తీరు సరికాదు
నెల రోజుల్లోనే నిత్యావసరాల ధరలు పెరిగాయి. పప్పులు కొనలేకపోతున్నాం. నూనెల ధరలు చూస్తే వణుకు పుడుతోంది. సామాన్యులు బతకలేని స్థితిలో ఉన్నారు. ధరలను అదుపులోకి తెచ్చే మార్గం లేకుండా పోతోంది. ప్రభుత్వం తీరు సరికాదు. – డి.సుందరమ్మ సర్పంచ్
మేజర్ పంచాయతీ, హిరమండలం
సామాన్యులకు అందనంత దూరంలో నిత్యావసరాల ధరలు
చేతులెత్తేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆందోళనలో పేద, మధ్య తరగతి ప్రజలు
గుండెలధరతున్నాయి..!
గుండెలధరతున్నాయి..!
గుండెలధరతున్నాయి..!
గుండెలధరతున్నాయి..!


