కుక్కల దాడిలో జింకపిల్ల మృతి | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో జింకపిల్ల మృతి

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

కుక్క

కుక్కల దాడిలో జింకపిల్ల మృతి

ఆదిత్యుని సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరసవల్లి: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ తొలిసారిగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయంలో ఆయన గోత్రనామాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తర్వాత అనివెట్టి మండపంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతను, పర్వదినాల ప్రత్యేకతలను ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, రంజిత్‌శర్మలు జస్టిస్‌కు వివరించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద జస్టిస్‌ సాష్టాంగ నమస్కార పూజతో పాటు కాసేపు ధ్యానం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి వివేకానంద శ్రీనివాస్‌, ప్రొటోకాల్‌ న్యాయమూర్తులు రాధాకృష్ణ, అనురాగ్‌, డీఎస్పీ వివేకానంద, సీఐ పైడపునాయుడు పాల్గొన్నారు.

ఇచ్ఛాపురం: పురపాలక సంఘం పరిధి శ్రీ పాతాళసిద్ధేశ్వరాలయం వద్ద కుక్కల దాడిలో జింకపిల్ల మృతిచెందింది. ఆదివారం శ్రీపాతాళ సిద్ధేశ్వరాలయం సమీపంలో గల కొండల నుంచి దారి తప్పిన జింకపిల్ల జనావాసాల్లోకి వచ్చింది. జింక పిల్లను గమనించిన కుక్కలు వెంబడించి దాడి చేశాయి. దాడి చేస్తున్న కుక్కల నుంచి జింకపిల్లను స్థానికులు కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికి మృతి చెందింది.

జిల్లా అధికారులకు హైకోర్టు నోటీసు

ఎచ్చెర్ల: కోర్టు తీర్పును ఉల్లంఘించారనే ఫిర్యాదుపై జిల్లా అధికారులకు హైకోర్టు నో టీసులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఎచ్చెర్ల మండలం, బొంతకోడూరు సర్పంచ్‌ పంచిరెడ్డి రాంబాబు హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వా లని కోరుతూ సంబంధిత అధికారులకు హైకో ర్టు ఈ నోటీసును జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బొంతలకోడూరు సర్పంచ్‌ పంచిరెడ్డి రాంబాబు తమ చెక్‌ పవర్‌ను అన్యాయంగా రద్దు చేశారని గతంలో కోర్టును ఆశ్రయించగా.. కోర్టు 2025 నవంబర్‌ 25 న ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఆరోపిస్తూ పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ అమరావతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ప్రతివాదులైన అధికారులు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కె.భారతిసౌజన్య, టెక్కలి డివిజనల్‌ పంచాయతీ అధికారి ఐ.వెంకటరమణలకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఈ కేసును ఎందుకు విచారణకు స్వీకరించకూడదో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

‘స్వయం ఉపాధి వైపు ఆలోచించండి’

శ్రీకాకుళం న్యూకాలనీ: మాజీ సైనికులు, కు టుంబ సభ్యులు వ్యవసాయ రంగంలో స్వ యం ఉపాధి వైపు అడుగులు వేయాలని జిల్లా సైనిక సంక్షేమాధికారి శైలజ పేర్కొన్నారు. ఆదివారం మాజీ సైనిక, కుటుంబ సభ్యులకు పెద్దపాడు రోడ్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వ్యవ సాయ డ్రోన్లపై శిక్షణతో కూడిన అవగాహన సదస్సును నిర్వహించారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కోరమండల్‌, దక్ష డ్రోన్స్‌ సహకారంతో నిర్వహించిన ఈ డ్రోన్స్‌ అవగాహన క్యాంపులో శైలజ మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమంలో సు మారు 60 మంది పైగా మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయంలో రంగంలో డ్రోన్ల ప్రయోజనాలు, స్వయం ఉపాధి అవకాశాలను శ్రీనివాస్‌ ప్రసాద్‌, మోహన్‌ తదితరులు వివరించారు.

కుక్కల దాడిలో మృతి చెందిన జింకపిల్ల

కుక్కల దాడిలో జింకపిల్ల మృతి 1
1/2

కుక్కల దాడిలో జింకపిల్ల మృతి

కుక్కల దాడిలో జింకపిల్ల మృతి 2
2/2

కుక్కల దాడిలో జింకపిల్ల మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement