అంకెల గారడీ బడ్జెట్
● డీసీసీ అధ్యక్షుడు
సనపల అన్నాజీరావు
శ్రీకాకుళం అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఆదాయ వనరులకు, చేస్తున్న ఖర్చుకు, ఉన్న అప్పులకు పొంతన లేకుండా బడ్జెట్ ఉందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకే దిక్కులేదన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, దీపం పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు తక్కువ మోతాదులో కేటాయించారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్లు వంటి వాటికి నిధులు కేటాయింపులు మరిచారని దుయ్యబట్టారు.


