పీఆర్‌సీ సాధనకు చలో విజయవాడ
శ్రీకాకుళం: పీఆర్‌సీ సాధనకు ఈ నెల 17న నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్‌లో బుధవారం జిల్లా సహాధ్యక్షుడు ఎండ ఉమాశంకర్ అధ్యక్షతన ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషనర్ నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. గురువారంజరగనున్న కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీమ్మూర్తి, గౌరవాధ్యక్షుడు కోరాడ వైకుంఠరావు, సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, కోశాధికారి పి సూర్య ప్రకాష్, రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి రవీంద్ర, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా కార్యదర్శులు గొంటి సురేష్, ఎస్.స్వర్ణ కుమారి, టి.వి.టి.భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్ ఆర్.దమయంతి, మహిళా విభాగం నాయకులు కె.శాంతి ప్రియ తదితరులు పాల్గొన్నారు.


