నైపుణ్య విద్యే లక్ష్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్య విద్యే లక్ష్యం కావాలి

Feb 12 2026 7:18 AM | Updated on Feb 12 2026 7:18 AM

నైపుణ

నైపుణ్య విద్యే లక్ష్యం కావాలి

ఎచ్చెర్ల : నేటి పోటీ ప్రపంచంలో కేవలం పుస్తక జ్ఞానం సరిపోదని, విద్యార్థులు నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ (జెఎన్‌టీయూ–జీవీ) వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.వి.సుబ్బారావు సూచించారు. చిలకపాలెంలోని శ్రీ శివానీ కళాశాల 20వ వార్షికోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బాలాజీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, విలువలు అలవర్చుకోవాలన్నారు. దుప్పల వెంకటరావు, దానేటి శ్రీధర్‌లు మాట్లాడుతూ కాలేజీ రిలీవ్‌ అయ్యేలోగా ప్లేస్‌మెంట్‌ సాధించాలన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీలు, క్విజ్‌, అకడమిక్‌ టాపర్లకు జ్ఞాపికలు, పతకాలు, ప్రోత్సాహకాలు అందించారు. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్‌ వై.శ్రీనివాసరావు వార్షిక నివేదికలను సమర్పించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు వి.ఎం.ఎం సాయినాథ్‌రెడ్డి, కె.దుర్గాశ్రీనివాసరావు, పి.దుర్గా ప్రసాద్‌రాజు, ఎస్‌.శ్రీనివాసరావు, జె.హరీష్‌, ఎస్‌.పాపినాయుడు తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్య విద్యే లక్ష్యం కావాలి 1
1/1

నైపుణ్య విద్యే లక్ష్యం కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement