నేడు దేశవ్యాప్త సమ్మె
రణస్థలం: లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని కోరుతూ గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం రణస్థలం, పైడిభీమవరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఉమ్మడిగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎన్.నాగేశ్వరరావు, కె.బోగేష్, బి.తోటయ్య, గురు, ఈశ్వరరావు, రమణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.
సౌర విద్యుత్‌కు ఆదరణ
శ్రీకాకుళం: రూఫ్ టాప్ సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు దేశాభివృద్ధికి దోహదపడవచ్చని ఆర్‌కే టెక్నాలజీస్ అధినేత పైడి చందు బుధవారం తెలిపారు. సూర్యకాంతితో విద్యుదుత్పత్తి మూలంగా కరెంట్ బిల్లు పూర్తిగా తగ్గడంతో పాటు అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ గ్రిడ్‌కు చేరి తిరిగి వినియోగదారుడికే ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చు తక్కువే కాబట్టి ప్రతి ఒక్కరూ సౌర ఫలకాలు తమ ఇళ్లపై ఏర్పాటు చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలన్నారు. ఏపీఈపీడీసీఎల్, నెడ్‌క్యాప్ అన్ని విధాలా సహకారం అందిస్తున్నాయని చెప్పారు.
గార : సర్వశిక్ష అభియాన్ పధకం కింద నియమితులైన పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల విషయంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ పార్ట్‌టైమ్ టీచర్ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి పి.వి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం గారలో ఆయన విలేకరుతో మాట్లాడుతూ 13 ఏళ్లుగా సర్వశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ఆర్ట్స్, క్రాప్ట్స్, వ్యాయాయ ఉపాధ్యాయులందరూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం–2009కి లోబడి 2013 నుంచి రెగ్యులర్ చేసి ఇతర ప్రయోజనాలను కల్పించాలన్నారు.
17న జిల్లా స్థాయి చెస్
ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శాప్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఈ నెల 17న శ్రీకాకుళంలో జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు తెలిపారు. శాంతినగర్‌కాలనీలో ఉన్న ఇండోర్ స్టేడియం వేదికగా అండర్–13, అండర్–15, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా ఎంపికలు మొదలుకానున్నాయని చెప్పారు. విజేతలగా నిలిచిన బాలురు, బాలికలను ఈ నెల 21 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నామని తెలిపారు. వివరాలకు 7680075375, 9390352942 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఎస్‌ఎస్‌ఆర్ చిత్రం విజయం తథ్యం
శ్రీకాకుళం అర్బన్ ఎస్‌ఎస్‌ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం జిల్లాలో షూటింగ్ శరవేగంగా సాగుతోందని, చిత్రం విజయం సాధించడం తథ్యమని సీనియర్ నటుడు శివారెడ్డి అన్నారు. శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ఓ హోటల్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంచి నటులతో కలిసి సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను నిర్మిస్తున్న తొలి చిత్రానికి నటులు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని చెప్పారు. నటుడు షకలక శంకర్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ జిల్లాలోనే జరుగుతున్నా విడుదల మాత్రం వరల్డ్ వైడ్‌గా ఉంటుందని చెప్పారు. సమావేశంలో నటులు భద్రం, జెమినీ సురేష్, దర్శకుడు వెంకట సురేష్, కెమెరామెన్ శివారెడ్డి పాల్గొన్నారు.
అభాగ్యులకు అండగా..
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఆశ్రమాల్లో తలదాచుకున్న అభాగ్యులైన వృద్ధులకు, నిరాశ్రయులకు రక్షణ కల్పించడంలో జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ముందంజలో ఉంటుందని సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. బుధవారం కలెక్టరేట్ రోడ్డులోని సీ్త్ర సదనంతో పాటు ద్వారకానగర్, ఇలిసిపురంలోని ఖ్యాతి ఫౌండేషన్ సీనియర్ సిటిజన్స్ హోమ్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఆశ్రమాల్లో ఉండేవారు కుటుంబసభ్యులతో మళ్లీ కలిసేలా సంస్థ తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్ జి.ఇందిరాప్రసాద్, ఎస్.ధనలక్ష్మి, ఆర్.శ్రావణి పాల్గొన్నారు.
నేడు దేశవ్యాప్త సమ్మె
నేడు దేశవ్యాప్త సమ్మె
నేడు దేశవ్యాప్త సమ్మె


