రాజకీయ లబ్ధి కోసమే అసత్యాల ప్రచారం
నరసన్నపేట: రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన లడ్డూ పేరిట చంద్రబాబు ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. లడ్డూలో వినియోగించిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వులు కనిపించలేదని సిట్ నిర్ధారించిన నేపథ్యంలో కూటమి నాయకులంతా భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు 2024 జూన్, జులై నెలల్లో అంటే కూటమి ప్రభు త్వం అధికారంలో ఉన్నప్పుడే టీటీడీకి వచ్చా యని కృష్ణదాస్ ఆధారాలతో సహా వివరించా రు. జూలై 25న నాణ్యత లేదని టీటీడీ తిప్పి పంపిన 4 ట్యాంకర్లను జూలై 27న దొడ్డిదారిన మళ్లీ టీటీడీలోకి పంపి లడ్డూ ప్రసాదంలో వాడారని సిట్ చార్జిషీట్ నివేదించిన(44వ పేజీలో) స్పష్టంగా ఉందని వివరించారు. వివాదాస్పద బోలే బాబా(హార్ష్ ఫ్రెస్ డైరీ) కంపెనీకి చంద్ర బాబు హయాంలోనే 2019 మార్చిలో అను మతులు వచ్చాయని గుర్తు చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్ సీపీపై బురద జల్లుతున్నారని కృష్ణదాస్ మండిపడ్డారు.
● భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్


