● ఇబ్బందులు పడుతున్న మహిళలు, విద్యార్థులు ● పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

● ఇబ్బందులు పడుతున్న మహిళలు, విద్యార్థులు ● పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు

Feb 11 2026 8:47 AM | Updated on Feb 11 2026 8:47 AM

● ఇబ్

● ఇబ్బందులు పడుతున్న మహిళలు, విద్యార్థులు ● పీజీఆర్‌ఎస్

● ఇబ్బందులు పడుతున్న మహిళలు, విద్యార్థులు ● పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చాలా ఇబ్బందిగా ఉంది

శ్రీకాకుళం క్రైమ్‌:

శ్రీకాకుళం జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నాడ బ్రిడ్జి వంతెన బస్‌ షెల్టర్‌ సమీప రామ మందిరం వద్ద బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ఇటీవల ఓపెన్‌ చేశారు. దీంతో మందుబాబుల ఆగడాలు రాత్రి, పగలూ మితిమీరిపోతుండడంతో సోమవారం స్థానిక మహిళలు రోడ్డుమీదకొచ్చి ధర్నాలు చేశారు. అనంతరం జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు వెళ్లి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ తొలగించాలని వినతిపత్రం అందజేశారు. ఇదే రోడ్డులో విద్యార్థులు బడులకు వెళ్తుంటారని తెలియజేశారు. ఉన్నతాధికారులు పనులకు వెళ్లే దారిలోనే ఈ బార్‌ ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని వాపోయారు. అయినప్పటికీ మంగళవారం సైతం మద్యం దుకాణం వద్ద విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రొవిజనల్‌ లైసెన్సే ఇచ్చాం..

శ్రీకాకుళం ఎకై ్సజ్‌ స్టేషన్‌ సీఐ ఎంవీ గోపాలకృష్ణ వద్ద ‘సాక్షి’ ఇదే విషయం ప్రస్తావించగా డ్రాలో షాపును దక్కించుకున్న యజమానికి ప్రొవిజనల్‌ లైసెన్సే ఇచ్చామని, దాని ప్రకారం ఎక్కడైనా పెట్టుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. పర్మినెంట్‌ లైసెన్సు ఇచ్చేటప్పుడు నిబంధనలు ప్రకారం లేకుంటే తొలగిస్తామని చెప్పారు.

రామ మందిరానికి నిత్యం పూజలకు వెళ్తాం. అటువైపే మార్నింగ్‌ వాక్‌ చేస్తాం. మగవాళ్లు డ్రింక్‌ చేసి మందిరం వద్దే రాత్రీ పగలూ ఉంటున్నారు. దీంతో చాలా ఇబ్బందిగా

ఉంటోంది.

– పద్మజ, స్థానికురాలు

● ఇబ్బందులు పడుతున్న మహిళలు, విద్యార్థులు ● పీజీఆర్‌ఎస్1
1/1

● ఇబ్బందులు పడుతున్న మహిళలు, విద్యార్థులు ● పీజీఆర్‌ఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement