ఇదేం పద్ధతి..? | - | Sakshi
Sakshi News home page

ఇదేం పద్ధతి..?

Feb 11 2026 8:47 AM | Updated on Feb 11 2026 8:47 AM

ఇదేం

ఇదేం పద్ధతి..?

● ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో అంధకారం ● అర్ధాంతరంగా నిలిచిన సెంటర్‌ లైటింగ్‌ పనులు ● కూటమి నాయకులే ఆపుతున్నారని ఆరోపణలు కూటమి నాయకులే కారణం పనులు ప్రారంభిస్తాం రోడ్డుపైకి రాలేని పరిస్థితి

● ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో అంధకారం ● అర్ధాంతరంగా నిలిచిన సెంటర్‌ లైటింగ్‌ పనులు ● కూటమి నాయకులే ఆపుతున్నారని ఆరోపణలు

ఇచ్ఛాపురం రూరల్‌: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా తయారైంది ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని సెంటర్‌ లైటింగ్‌ పరిస్థితి. ఇచ్ఛాపురం బాహుదా నది నుంచి సంతపేట మీదుగా బస్టాండ్‌ వరకు అధునాతనమైన బల్బులతో సెంటర్‌ లైటింగ్‌ వేసేందుకు సుడా అధికారులు నిర్ణయించారు. సుమారు రూ.50 లక్షలు సుడా నిధులతో రెండు నెలల క్రితం పనులు ప్రారంభించారు. ఈ పనులను విశాఖపట్నంకు చెందిన చంద్రా ఎలక్ట్రికల్స్‌కు అప్పగించారు. డివైడర్‌ మధ్యలో గోతులు తీసి వైరింగ్‌ ఏర్పాట్లు చేశారు. అయితే ఏమైందో ఏమో... పనులను అర్ధాతరంగా నిలిపివేశారు. దీంతో ప్రధాన రహదారులపై రాత్రి వేళ సరైన లైటింగ్‌ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివైడర్‌ నుంచి బయటకు వచ్చిన విద్యుత్‌ గొట్టాలు రోడ్డుపైకి తేలడంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంధకారంతో అవస్థలు

సెంటర్‌ లైటింగ్‌ తొలగించడంతో సంతపేట, ముత్యాలమ్మ ఆలయ ప్రాంతం, మున్సిపాలిటీ కార్యాలయం మూడు రోడ్ల కూడలి, బస్టాండ్‌ ప్రాంతంతో పాటు నివాస ప్రాంతాలు రోడ్డు పక్కన వేసిన విద్యుత్‌ దీపాల గుడ్డి వెలుతురులో ఉంటున్నాయి. ఇరువైపులా రోడ్డుకు సరైన వెలుతురు లేక అంధకారం కావడంతో మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అదే ప్రాంతంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ప్రైవేటు ఆస్పత్రి, బ్యాంకు, హోటల్స్‌, ఎకై ్సజ్‌ కార్యాలయం ఉన్నాయి. ప్రజా భద్రతపై మున్సిపాలిటీ, సుడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ కారణమేనా..?

మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ పాలకవర్గం ఉండడంతో కూటమి ప్రభుత్వం ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో అభివృద్ధిని అడ్డుకుంటోందని వైఎస్సార్‌సీపీ

కేవలం రాజకీయ నెపంతోనే కూటమి నాయకులు ఇచ్ఛాపురం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ప్రస్తుత పాలక వర్గానికి మరో నెలన్నర పదవీ కాలం ఉండగా, ఎక్కడ అభివృద్ధి మా ఖాతాలోకి వచ్చేస్తుందోనన్న ఆలోచనతో జరగాల్సిన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రాజకీయాలు, పదవుల కంటే అభివృద్ధే ధ్యేయంగా ఉండాలనే విషయాన్ని కూటమి నాయకులు మరిచిపోతున్నారు. సెంటర్‌ లైటింగ్‌ పనులు నిలిచిపోవడానికి ఇవే కారణాలు.

– బచ్చు జగన్‌,

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌, ఇచ్ఛాపురం

సుడా నిధులు రూ.50 లక్షలతో సెంటర్‌ లైటింగ్‌ పనులు చేపట్టేందుకు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పనులు విశాఖపట్నంకు చెందిన చంద్రా ఎలక్ట్రికల్స్‌కు అప్పగించాం. అర్థాంతరంగా పనులు నిలిపివేశారు. మరోమారు సంబంధిత ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌తో మాట్లాడి త్వరలోనే పనులు పూర్తి చేస్తాం.

– పి.సుగుణాకర్‌,

సుడా ఎస్సీ, శ్రీకాకుళం

సెంటర్‌ లైటింగ్‌ పేరుతో ఉన్న లైట్లను తొలగించి మా ప్రాంతాన్ని అంధకారం చేసేశారు. సుమారు రెండు నెలలు నుంచి మిడిమిడి వెలుతురులో రాత్రి సమయాల్లో బయటకు రావాల్సి వస్తోంది. రాత్రి సమయాల్లో వాహనాలపై వెళ్లిన వారు డివైడర్‌ నుంచి బయటకు వచ్చిన పైపుల మూలంగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి లైటింగ్‌ ఏర్పాటు చేయాలి.

– కె.జమున, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ

కౌన్సిలర్లు బహిరంగంగా విమర్శిస్తున్నారు. టీడీపీ కౌన్సిలర్లు ఉండే వార్డుల్లో మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని, వారికి మాత్రమే అధికారులు నిధులు కేటాయిస్తున్నారంటూ ఇటీవల జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలకవర్గం పదవీ కాలం మరో రెండు నెలలు మాత్రమే ఉండడంతో కావాలనే సెంటర్‌ లైటింగ్‌ అభివృద్ధి పనులు ప్రస్తుత పాలకవర్గం ఖాతాలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని కొందరు నాయకులపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలనే లైటింగ్‌ పనులు నిలిపివేసి, పనులను అర్ధాంతరంగా వదిలేశారని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా రాజకీయాలను పక్కనబెట్టి వెంటనే సెంటర్‌ లైటింగ్‌ పనులు పునరుద్ధరించాలని కోరుతున్నారు.

ఇదేం పద్ధతి..? 1
1/2

ఇదేం పద్ధతి..?

ఇదేం పద్ధతి..? 2
2/2

ఇదేం పద్ధతి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement