కోర్సుల ఉపాధి
న్యూస్‌రీల్
శ్రీకాకుళం
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
‘సుప్రీం తీర్పు అమలు చేయాలి’
శ్రీకాకుళం: సర్వ శిక్షా అభియాన్ పథకం కింద నియమితులైన పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల విషయంలో తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయా లని ఆర్ట్, క్రాఫ్ట్, హెల్త్ పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షుడు చిగిలిపెల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశా రు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకున్న సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్ట ల్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం తాజాగా చారిత్రక తీర్పు వెలువరించిన ట్లు తెలిపారు. పదేళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇకపై ‘కాంట్రాక్ట్’ ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదని, పూర్తిస్థాయి ఉపాధ్యాయులే అవుతారని స్పష్టం చేసిందని పేర్కొన్నా రు. విద్య హక్కు చట్టం – 2009కి లోబడి జిల్లాలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు 2013 నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ ఎన్‌సీటీఈ నిర్దేశించిన ప్రాథమిక విద్యార్హతలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలని కోరారు.
‘వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి’
జలుమూరు: పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, దీని కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని డీఈఓ ఎ.రవిబాబు అన్నారు. మంగళవారం లింగాలవలస ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. టీచర్లు విద్యార్థులను గమనించి ఏ అంశంలో వెనుకబడ్డారో అందులో సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం పథ కం పరిశీలించారు.
‘ఏయూ డిస్టెన్స్ సెంటర్ కొనసాగించాలి’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ సెంటర్‌ను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ స్టడీ సెంటర్ వద్ద విద్యార్థు లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, పి.ఖగేష్‌లు మాట్లాడుతూ ఏయూ డిస్టెన్స్‌లో చదివే విద్యార్థులు క్లాసులకు వెళ్లగా, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ వైజాగ్ ట్రాన్స్‌ఫర్ చేశారని, కొత్తగా ఎవరిని ఇక్కడికి అలాట్ చేయలేదని, విద్యార్థుల కోసం సపోర్టింగ్ స్టాఫ్ ఎవరూ లేరని చెప్పడం దారుణమన్నారు. 2025– 2026లో 1500 మందికి పైగా విద్యార్థులు ఈ సెంటర్ ద్వారా అడ్మిషన్ తీసుకున్నారని, ఇప్పుడు సడన్‌గా ఈ హెల్ప్ సెంటర్ మూసివేయడం వల్ల వీరికి ఇబ్బంది ఎదురవుతుందన్నారు.
ప్రభుత్వం స్పందించాలి
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చేసే మైరెన్ కోర్సులు ఏర్పాటు విషయమై ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు స్పందించి తగు నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కోర్సుల ఏర్పాటు విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
– కర్రి యుగంధర్,
చింతాడ, డిగ్రీ విద్యార్థి
మైరెన్ కోర్సులు లేకపోవడం
బాధాకరం..
సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో మైరెన్ కోర్సులకు సంబంధించిన ఎలాంటి ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సు లు లేకపోవడం బాధాకరం. ఆసక్తి ఉన్నప్పటికీ స్థానికంగా ఇక్కడ కోర్సులు లేకపోవడం బాధగా ఉంది.
– కూన ద్రాక్షాయణి, సరుబుజ్జిలి, బీఎస్సీ ఫైనలియర్, హెచ్‌పీఎన్ డిగ్రీ కాలేజ్
మైరెన్ రంగంలో ఎన్నో
అవకాశాలు..
మైరెన్ కోర్సులు పూర్తిచేసినవారికి మైరెన్ ఇంజినీర్లు, నావిగేటింగ్ ఆఫీసర్లు, షిప్ బిల్డర్లు, ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ కంపెనీల్లో, సముద్రయానం, ఓడల నిర్మాణం, ఇంజినీరింగ్ నిర్వహణలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పనిచేసే అవకాశం ఉంటుంది.
– రౌతు దిలీప్, డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి, అంగూరు
ఏర్పాటు చేయాలి
మైరెన్ కోర్సులు పూర్తిచేసినవారికి ఉపాధి పుష్కలంగా లభిస్తాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో యూనివర్సిటీ ఉన్నప్పటికీ మైరెన్ ఇంజనీరింగ్, బీఎస్సీ జియాలజీ, బీఎస్సీ నాటికల్ సైన్స్, డిప్లమో ఇన్ నాటికల్ కోర్సులు లేవు. ఏర్పాటు చేయాలి.
– అక్కినపల్లి స్వాతి, బీఎస్సీ బీజెడ్‌సీ సెకండియర్, అరసవల్లి
స్థానిక వనరుల ఆధారంగా బీఆర్‌ఏయూలో ఏర్పాటు కాని కోర్సులు
నేటికీ అందుబాటులోకి రాని జియాలజీ కోర్సు
కీలకంగా మారుతున్న మైరెన్ బయాలజీ
ఆ దిశగా ఆలోచించని పాలక మండలి
ప్రయోజనాలేమిటి..
మైరెన్ బయాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఆయిల్ కంపెనీలు, ఎన్విరాన్‌మెంట్ లేబొరేటరీస్, మైరెన్ లేబొరేటరీస్, జూ, కోస్టల్ అథారిటీస్, టూరిజం సంబంధిత సంస్థల్లో అవకాశాలు దొరుకుతాయి.
ఎక్కువగా పరిశోధన రంగమే ఉపాధికి కేంద్రంగా నిలుస్తుంది.
ఎకో టూరిజానికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అందులో చక్కని అవకాశాలు పొందవచ్చు.
నేచురలిస్టు, మైరెన్ మ్యూజియం అడ్మినిస్ట్రేటర్, లేబొరేటరీ టెక్నీషియన్, అక్వేరి యం అడ్మినిస్ట్రేటర్, ఫిషరీస్ ఎక్స్‌పర్ట్స్ వంటి హోదాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది.
అర్హత, అనుభవంతో పేరున్న కంపెనీల్లో అధిక వేతనాలు పొందవచ్చు.
లేబొరేటరీ, ప్రభుత్వ సంస్థల్లో కూడా మంచి వేతనాలు వస్తాయి.
విదేశాల్లో కూడా వేతనాలు అధికంగానే ఉంటున్నాయి.
వర్సిటీ అధికారులు దృష్టి పెడితే చాలు కోర్సు అమల్లోకి వస్తుంది. ఇక్కడున్న వనరులను ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందనే కోణంలో అధ్యయనం చేసేలా కోర్సును ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
అనుభవజ్ఞులైన వారితో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టడీస్‌ను ఏర్పాటు చేయాలి. వారిచ్చే సూచన లు,సలహాలు ఆధారంగా కరిక్యులమ్ తయారు చేయాలి. దాన్ని గవర్నింగ్ బాడీలో పెట్టి అనుమతి సాధిస్తే జిల్లాలో ఉన్న విద్యార్థులకు ఉపయోగపడుతుందని స్థానికులు కోరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాలంతోపాటు పరిగెత్తడం ఆపేసింది. సంప్రదాయ కోర్సులతోనే విద్యా సంవత్సరాలు నెట్టుకువస్తున్న యూనివర్సిటీ కొత్త కోర్సుల జోలికి వెళ్లడం లేదు. జిల్లాలో కొత్త అవకాశాలు పురుడు పోసుకుంటున్న తరుణంలో ఆ దిశగా విద్యార్థులను సిద్ధం చేయాల్సిన సంస్థ స్తబ్ధుగా ఉండిపోతోంది. జిల్లాలో మైరెన్ బయాలజీ కోర్సు రానున్న కాలంలో కీలకం కానుంది. 193 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం మన సొంతం. కళింగపట్నం, బారువ, భావనపాడు, మూలపేట వంటి ముఖ్యమైన బీచ్‌లు ఉన్నాయి. మత్స్యకారుల జీవనోపాధి, పర్యాటక అభివృద్ధికి, మూలపేట పోర్టు వంటివి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైరెన్ బయాలజీ కోర్సు అందుబాటులో ఉంటే మన విద్యార్థులు ఇక్కడే ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. కానీ యూనివర్సిటీ ఆ దిశగా దృష్టి సారించడం లేదు. ఎంతసేపూ పాత వాసనలతోనే ముందుకు సాగుతోంది. అప్‌డేట్ కావడం లేదు.
ఏ ఏ కోర్సులు కావాలి...
అంబేడ్కర్ యూనిర్సిటీలో ప్రధానమైన జియాలజీ కోర్సే లేదు. ఆ కోర్సు కోసం ఎంతో మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. వెళ్లలేని వారు ఆసక్తి ఉన్నా వెనక్కి తగ్గిపోతున్నారు.
డిగ్రీ స్థాయిలో జియాలజీ కోర్సు ఉన్నప్పటికీ పీజీ స్థాయిలో లేకపోవడం మైనస్‌గా మారింది. దానికి అనుబంధమైనదే మైరెన్ బయాలజీ. ఇప్పుడీ కోర్సుకు ప్రాధాన్యత పెరిగింది.
మనకున్న సుదీర్ఘ తీర ప్రాంతం, ఇతరత్రా పరిశ్రమల దృష్యా జియాలజీతో పాటు మైరెన్ బయాలజీ కోర్సులను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఆసక్తి ఉన్నా స్థానికంగా కోర్సుల్లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికే మూలపేట పోర్టు నిర్మాణంలో ఉంది. పాలకులు దృష్టి పెడితే బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ పూర్తయ్యే అవకాశం ఉంది. మంచినీళ్ల పేట జెట్టీ పూర్తయితే వినియోగంలోకి వస్తుంది. మత్స్య సంపద విక్రయ కేంద్రాలు ఉన్నాయి. విశాలమైన తీర ప్రాంతంలో అటవీ ప్రాంతం కూడా ఉంది. వీటిన్నింటికీ మైరెన్ బయాలజీ కోర్సు ఉపయోగపడుతుంది.
ఈ రకంగా అంబేడ్కర్ యూనివర్సిటీ అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది.
పర్యావరణంపై అవగాహన పెరిగింది. పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాయి. భూ పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు భూమిపై 70శాతం వరకు ఆవరించి ఉన్న నీటి వనరులపై దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలోనే మైరెన్ బయా లజీ కోర్సుకు ప్రాముఖ్యత సంతరించుకుంది.
విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉండటంతో ఎన్నో జీవులు, వృక్షాలు, సూక్ష్మజీవులకు ఆవాసం ఏర్పడింది. వీటన్నింటిపైన అధ్యయనం చేసేందుకు మైరెన్ బయాలజీ ఉపయోగపడుతుంది.
సునామీ, సైక్లోన్ వంటి ప్రకృతి విపత్తులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి దోహదపడుతుంది. మైరెన్ బయాలజీకు సంబంధించి గ్రాడ్యుయేషన్ నుంచి పీహెచ్‌డీ వరకు కోర్సులు అందుబాటులోకి తేవాలి.
పీజీలో ఓషనోగ్రఫీ, ఫిషరీస్, ఫిజికల్ ఓషియనోగ్రఫీ, ఓషియన్ ఫార్మింగ్, వాటర్ క్వాలిటీ ఫారామీటర్, ఎనర్సీ రీసోర్సెస్–కన్వర్షన్, కెమికల్ ఓషియనోగ్రఫీ తదితర సబ్జెక్ట్‌లను బోధించేలా కరిక్యులమ్ ఏర్పాటు చేయాలి.
ఈ విభాగంలో నిపుణులు మైరెన్ బయాల జిస్టులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది.
మొక్కలు, జంతువులు, సూక్ష్మ జీవులు అంశాలపై పరిశోధనలు చేసి, సమాచారాన్ని విశ్లేషించి మొక్కల జీవన విధానం, సముద్ర జీవుల ప్రవర్తన, వాటిపై పర్యావరణ ప్రభావం వంటి అంశాలపై అధ్యయనం సాగించడానికి ఉపయోగపడతారు.
సంబంధిత అంశాలపై వ్యాపార, పర్యావరణ, ప్రభుత్వ సంస్థకు సలహాలు కూడా అందజేసే అవకాశం ఉంటుంది.
కోర్సుల ఉపాధి
కోర్సుల ఉపాధి
కోర్సుల ఉపాధి
కోర్సుల ఉపాధి
కోర్సుల ఉపాధి
కోర్సుల ఉపాధి
కోర్సుల ఉపాధి
కోర్సుల ఉపాధి


