కనికుట్టు విద్య
● నృత్య ప్రదర్శనలు ఇచ్చే చిన్నారుల డ్రెస్ డిజైనింగ్‌లో ప్రతిభ చూపుతున్న దర్జీ
● 40 ఏళ్లుగా ఇదే వృత్తిలో రాణిస్తున్న ఏకై క వ్యక్తి
● వేల మందికి కాస్ట్యూమ్స్ డిజైనింగ్
శ్రీకాకుళం కల్చరల్: నృత్య ప్రదర్శన ఎక్కడ చేసినా ముందు ఆయన వద్దకు వెళ్లాల్సిందే. శిక్షణ నుంచి ఆరంగేట్రం వరకు అన్ని దశల్లోనూ ఆయనను కలవాల్సిందే. నాట్య ప్రదర్శనలో అడుగులు ఎంత లయబద్ధంగా కదపాలో, ము ఖ కవళికలు ఎంత అందగా ఉండాలో, భంగిమ లు ఎంత శ్రద్ధగా కుదరాలో ఆహార్యం కూడా అంతే సుందరంగా అమరాలి. అందుకు 40 ఏళ్లుగా ఏకై క చిరునామా వీరభద్రరావు. రంగురంగుల పట్టు వస్త్రాలు, కచ్చితమైన కొలతలతో కూడిన ఆ దుస్తుల వెనుక ఒక సామాన్య టైలర్ అసామాన్య కృషి దాగి ఉంది. ఆయనే శ్రీకాకుళంలో సుపరిచితులైన మల్లెమొగ్గల వీరభద్రరావు (భద్రం). చదివింది ఐదో తరగతి అయినా, శాసీ్త్రయ నృత్య దుస్తుల తయారీలో ఆయనది అందెవేసిన చేయి.
40 ఏళ్లుగా ఈ వృత్తిలోనే..
వీరభద్రరావు బాల్యంలో తన మేనమామ చాగంటి నాగేశ్వరరావు కుట్టు మిషన్‌పై దుస్తులు కుడు తుంటే చూసి ఆసక్తి పెంచుకున్నారు. కుట్టు వృత్తి పైనే మక్కువతో 40 ఏళ్లుగా ఇవే దుస్తులు కుడుతున్నారు. ప్రారంభంలో పౌరాణిక సినిమాల ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా నంద మూరి తారకరామారావు ధరించే వైవిధ్యమైన దుస్తులను చూసి, డ్రామా కళాకారులకు అలాంటి దుస్తులు కుట్టడం మొదలుపెట్టారు. 1990వ దశకంలో నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్ ప్రోత్సాహంతో శాసీ్త్రయ నృత్యాల వైపు మళ్లింది. ఎలాంటి అధికారిక శిక్షణ లేకపోయినా, కేవలం స్వయంకృషితో అవగాహన పెంచుకున్నారు.
విదేశాలకు సైతం..
నేడు కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, మోహినియాట్టం వంటి ఏ శాసీ్త్రయ నృత్యానికై నా భద్రం కుట్టిన దుస్తులు ఉండాల్సిందే. ఆయన నైపు ణ్యాన్ని గుర్తించిన డ్యాన్స్ మాస్టర్లు తమ విద్యార్థులకు భద్రం చేతనే దుస్తులు కుట్టించడానికి మొగ్గు చూపుతారు. అమెరికా వంటి దేశాల నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయంటే ఆయన పనితనం అర్థం చేసుకోవచ్చు.
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు శ్రీకాంత్, శివ కుమార్, మెహర్ విద్యావిహార్, నీరజలతో పాటు స్వాతి స్వామినాథన్ వంటి జాతీయ స్థాయి గురువులకు ఈయన అంటే ఎంతో ఇష్టం. ఆయనకు భార్య సుబ్బలక్ష్మి, ఆయన శిష్యురాలు బాలనాగమణి సహకారం అందిస్తున్నారు.
వీరభద్రరావు రూపొందించిన
డ్రెస్‌లో
చిన్నారి
నృత్య
భంగిమ
డ్యాన్స్ మాస్టర్ల సహకారంతోనే..
నేను ఇంతగా ఎదగడానికి కారణం డ్యాన్స్ మాస్టర్లు నాకు ఇస్తున్న సహకారం. నాట్యగురువు శ్రీకాంత్ నన్ను ముందుగా ప్రోత్సహించారు. నాటి నుంచి నా జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగుతోంది.
– ఎం.వీరభద్రరావు, దర్జీ, శ్రీకాకుళం
కనికుట్టు విద్య


