ఏపీ గట్కా టీమ్ కోచ్‌గా సత్యవరం స్కూల్ పీడీ
నరసన్నపేట: జాతీయ స్థాయిలో పంజాబ్ రాష్ట్రం లూథియానాలో జరగనున్న గట్కా(కర్రసాము) పోటీలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ టీమ్ కోచ్‌గా సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ జ్యోతీరాణి నియమితులయ్యారు. జాతీయ స్థాయిలో గట్కా పోటీ లు 5 నుంచి 10 వ తేదీల్లో జరగనున్నాయని పీడీ తెలిపారు. ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం పయనం అవుతున్నట్లు తెలిపారు. విజయవాడ చేరుకొని అక్కడ నుంచి లూథియానాకు వెళ్లనున్నట్లు వివరించారు.
నేటి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను శుక్రవారం నుంచి అందజేయనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాత భూహక్కు పత్రాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన 652 గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభల ద్వారా 2,54,218 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో 13 మండలాల్లో 277 రెవెన్యూ గ్రామాల్లో 1,25,716 పాస్ పుస్తకాలు అందజేయనున్నారు. టెక్కలి డివిజన్‌లో 9 మండలాల్లో 192 రెవెన్యూ గ్రామాల్లో 65,618 మంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. పలాస డివిజన్‌లో 8 మండలాల్లో 183 రెవెన్యూ గ్రామాల్లో 62,884 పాస్ పుస్తకాలు అందజేస్తారు.
జిల్లాను హరితమయం చేద్దాం: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మ ద్ ఖాన్‌లను పలు శాఖల ఉన్నతాధికారులు తమ సిబ్బందితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కలెక్టరేట్ సముదాయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. కొత్త ఏడాదిలో జిల్లాను హరితమయంగా మార్చేందుకు అధికారులు, ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
ఏపీ గట్కా టీమ్ కోచ్‌గా సత్యవరం స్కూల్ పీడీ


